(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేనొక విషయం ప్రత్యేకంగా చెబుతున్నాను, ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు అనుకరణ అనేది మానుకోవాలి. ఎవరో, నన్ను బిల్లీగ్రహంలాగ తయ్యారు చేయి ప్రభువా అని ప్రార్ధన చేస్తే, దేవుడు నా కుటుంబంలో నాకు ఒక్క బిల్లీగ్రహమే చాలు ఇంకొ, రెండో బిల్లీగ్రహం అక్కర్లేదు You believe yourself అని దేవుడు అజ్ఞాపించాడని ఈ మధ్య ప్రచారంలో ఉన్న విషయం! గనుక ఇప్పుడు నేను నా విషయం చెబుతా, నేను ఏక సంతాగ్రాహిని, నేను నాలుగున్నర సంవత్సరాలకే మా అమ్మను ఒక ప్రశ్న అడిగాను, ఈ సృష్టి అంతటిని, ప్రకృతిని, ఇక్కడ ఉన్న ఈ ప్రపంచమంతా దేవుడు చేస్తే దేవున్ని ఎవరు చేసారని! గనుక 5 సంవత్సరాలకు నేను రామాయణం మొత్తం చదివేసాను. అంటే కొంత Extra Ordinary intelligent quotient (IQ) అనేది నాకు ఉన్నది. నాలుగు, అయిదు సంవత్సరాలున్నప్పుడు నేను విన్న ప్రసంగాలు నాకింకా జ్ఞాపకము ఉన్నది. 120 సార్లు బైబిల్ని చదివి ముగించాను. ఈయన ఇలా ఎన్నిసార్లు చదువుతాడు అంటే ఎవరైన ఏకసంతాగ్రాహులు, వారు అక్షర, అక్షరము చదువరు. మూలనుండి – మూలవరకు ఏదైనా గ్రంథాన్ని స్కానింగ్ లాగా చదివేసరికి మొత్తం ఫాలోగ్రఫిలాగ మైండ్లో ఈ అక్షరాలంతా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. అదొక special mental fatigue (మానసిక శక్తి). అలా ఇప్పుడు ఆదిశంకరాచార్యులుగారు, వివేకానందులవారు. అలా కొంతమంది ఉంటారు. ఒక ప్రత్యేక Extra-Ordinary concentration ఏకాగ్రత, జ్ఞాపకం, గ్రహింపు ధారణ శక్తి. ఇవన్నీ దేవుడు నాకు తన వరముగా ఇచ్చాడు. ఎందుకంటే నన్ను ఈ పని చెయ్యమని నియమించాడు. గనుక ఈ కారణంతోని పుట్టించాడు కాబట్టి! నాలాగ చెయ్యాలి అని ఎవరూ పూనుకోకూడదు. అది తప్పు! అసలు ఓఫీర్ గారిలాగ చేస్తున్నామా, భక్తిసింగ్ రిలాగానా? పి.యం.సాముయేల్ గారి లాగానా, చార్లెస్ స్పర్జన్ గారు లాగానా అనే దృష్టే తప్పు వాళ్ళు మోకరించి దేవుణ్ణి అడిగి, ఇప్పుడు నేను ఎదురుకోబోతున్న కాంగ్రిగేషన్ (congregation) ఆ సమాజంయొక్క అవసరత ఏంటి? వాళ్ళపట్ల పరలోకంలో ఉన్న నీ మనస్సులో వాళ్ళ గురించిన థాట్ ఏమిటో నాకు బయలుపరచమని ప్రభువును అడిగి వెళ్ళాలి.
అలా అడిగినప్పుడు దేవుడు వాళ్ళ దృష్టికి ఒక వచనాన్ని తీసుకురావచ్చు. ఆ వచనాన్ని చదివితే స్టేజ్ మీద అప్పటికప్పుడు ప్రసంగం డెవలప్ కావొచ్చు. లేదా దేవుని ఆత్మ వాళ్ళని ఆవరించి, వశపరచుకొని మొత్తం మూలవాక్యం నుండి ముగింపు వాక్యం ద్వారా, దేవుడు అప్పటికప్పుడే వారికి బయలుపరచి, మనసు నిండా మాటలు నింపొచ్చు. ఎలీహు, ‘నా అంతరంగములోనిండ మాటలున్నది పగిలిపోవడానికి సిద్ధమైన ద్రాక్షాతిత్తిలాగ నా మనస్సు ఉన్నది’ అంటాడు. ‘అలాంటి అనుభవంతో ఉన్నవాళ్ళు కొంతమంది స్టేజ్ ఎక్కుతారు. కొంతమంది దేవుడు ఈ మొదటిమాట బయలుపరిచాడు. మరి ఎటు తీసుకెళ్తాడో ఆయనకే తెలుసు. అనే ఒక విశ్వాసంతో వేదిక ఎక్కుతారు. గనుక అందరూ, అన్ని సమయాలలో ఒకే రకంగా బోధ చెయ్యాలి అనే నిబంధన ఏమీ లేదు. ఇప్పుడు… పెంతకోస్తు పండుగ నాకు 3వేలమంది బాప్తిస్మం పొందినప్పుడు పేతురేమైనా రాసుకున్నాడా? ఊరికే అందరితోపాటు నిలబడి నోరు తెరచి మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్ని వేలమంది రక్షణ పొందారు. గనుక దేవుని వశములో మనం మాట్లాడాలి! అంతకముందు ఆ ప్రసంగం మన మనస్సులో ఉన్నదా! లేదా డైరెక్ట్ నోట్లొకొచ్చిందా? ఎప్పుడో ధ్యానం చేసిన విషయమా? మనకే తెలియని విషయం పలుకుతున్నామా? అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అనుభవం కలుగుతుంది. ఒకవేళ నన్ను నడిపించినట్టుగా దేవుడు మిమ్మల్నిగూడ నడిపిస్తే, నేను నీతోపాటు వేదికమిదికి వస్తాకదా! అన్న అనుభవం మీకొస్తే నాలాగ ప్రిపేర్ కాకుండా ఉండొచ్చు.
ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. లేకపోతే ఈ టాపిక్ అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు నేను నిద్రబోతాను గాని మేల్కొని ఉంటాను. నా దగ్గర అంతరంగికులకు చాల మందికి తెలుసు. నిద్రపోతూ, మంచి గురక పెడుతూ ఉంటాను అక్కడ వారి సంభాషణకు టకీమని జవాబిస్తాను. ఇంతసేపు వాళ్ళ సంభాషణ ఫాలో అయ్యాను. నాకు తెలిస్తు ఉంటుంది. నిద్రలో కూడ ప్రార్థన చేస్తు ఉంటాను. ద్వంద్వావధానం నేను సాధన చేసాను. అనే విషయం కూడ నేను చాలా సార్లు ప్రసంగంలో చెప్పాను. భక్తులందరూ ద్వంద్వావధానం చెయ్యాలి. మనస్సు రెండుగా చీలిపోవాలి. మనలో ఒక భాగం పరలోకానికి ప్లగ్ పెట్టేసి ఉండాలి. రెండవ భాగం ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో పని చేస్తూ ఉండాలి. మిత్రులతో మాట్లాడినా వృత్తిపరమైన కార్యక్రమాలు చేసినా, కాలకృత్యాలుగాని, భోజనాల పనులుగాని, ఇంకేమైన భాద్యతలుగాని అన్ని కూడ మన మనసులోనే సగం చెయ్యాలి. ఒక సగం దేవునితో ఎప్పుడు సంభాషిస్తూ ఉండాలి. ఇది రెండు ప్రపంచాల్లో ఒకేసారి జీవించడం. ద్వంద్వావధానం. అష్టావధానం, శతావధానం చేయలేము. కనీసం ఈ ద్వంద్వావధానమైన చెయ్యాలి. అది నేను సాధన చేసిన విషయం దేవుడు నాకు నేర్పించిన విషయం.
అందుకని నేనిప్పుడు మీతో మాట్లాడుతూనే ఇంటికెళ్ళిన తర్వాత యాకోబు దేవుడు అనే గ్రంథాన్ని నేను ఇంగ్లీషులో తర్జుమా చేస్తున్న ఇప్పుడు ఇవన్ని మాట్లాడుతూనే నా మైండ్లో ఒక భాగం నెక్ట్ చాప్టర్ (Next chapter) The God of Jacob అనే గ్రంధంలో ఏమి రాయాలని క్యాలుకులేషన్ అవుతానే ఉంది. మరి మిగతా విషయాలు మాట్లాడుతున్న. ఇంటికెళ్ళగానే ఆ చాప్టర్ రాస్తాను. నాకు ఇబ్బంది కాదు. అలాగ ఒకొక్కరి సాధన అంతస్తు ఏ లెవెల్లో ఉన్నదనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకరిమీద ఒకరేమి కాపీ చేయనక్కరలేదు. దేవుడు ఎవరికిచ్చిన వరమును బట్టి వాళ్ళు వాడబడాలి!