129. ప్రశ్న : ఈ మధ్య మనకు యూట్యూబ్లో ఫ్లాట్యర్త్ (Flat Earth) గురించి చాలా వీడియోలు వస్తున్నాయి. భూమి రౌండ్ లేదు. ఎప్పుడు ఫ్లాట్గా ఉంటుంది? ఇంకొటి బుక్! ఆఫ్ ఇనొక్ గురించి చెప్పండి ఈ రెండిటికి ఇంటర్ కనెక్ట్ అయ్యి చాలా వీడియోస్ వస్తున్నాయి. వీట్లో ట్రంపుగారిని కూడ జాయిన్ చేసుకున్నారు. ఇలా చాలా కనూఫ్యీషన్గా ఉంది. ట్రంప్ గారి మీద ఇంప్లీచ్మెంట్ కూడానూ!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: బైబిల్లో ఉన్న ప్రతి అక్షరము దేవుని వాక్కు అని నమ్మాలి.  గాని ఇంటర్నెట్లో ఉన్నదంతా ప్రామాణికం అని అస్సలు నమ్మకండి. ప్రతి ఒక్కడు తనకు తోచిన అభిప్రాయాన్ని అడ్డమైన గాసిప్ అప్లోడ్ చేస్తా వున్నారు.  ఇప్పుడు ఇంటర్నెట్లో ఎన్నేన్నో ఉన్నాయి. వీళ్ళంత సూర్యుని దగ్గరకు పోయి, అక్కడేదో రికార్డ్ చేస్తే ఓం అని ఓంకారం వచ్చిందని! వీళ్ళు టేప్ రికార్డర్తో సూర్యుని దగ్గరకు పోతే అది కరిగిపోయినట్టు, టేప్ రికార్డర్ ఉండదు, ఈయన కూడ ఉండడు. సూర్యుని దగ్గరకు మనం లక్షమైళ్ళ దూరంలో కూడ వెళ్ళలేం తర్వాత నాసా (NASA) వాళ్ళు ఫోటో తీస్తే హిమాలయాల్లో వాళ్ళదేవుడు కనబడటము ఇదంతా విన్నప్పుడు, వాళ్ళ మతంలో ఉన్న భక్తిపరులే ఈ నాసా ఎందుకండీ? ఈ నాసాని ఎందుకు కలుపుతున్నారని ప్రొటెస్ట్ చేసినొళ్ళున్నారు.  90% of whatever is hap pening in the social media, internet is Gossip. ఇదంతా కూడా మీరు పట్టించుకోకండి!

            Flat Earth society అనేది చాలా కాలం నుండి వున్నది. దాంట్లో పెద్ద పెద్ద అడ్వకేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్లు ఉన్నారు. Earth is not round, it is Flat అని అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎర్త్ ఫ్లాట్గా ఉంటే దేవుడే దాన్ని ఫ్లాట్గా చేసాడు. రౌండ్గా ఉంటే దేవుడే రౌండ్గా చేసాడు. దేవుడున్నాడనేది వాస్తవం ఆయన పరిశుద్దుడనేది వాస్తవం. మనం పాపులమనేది వాస్తవం.  పాపంలో చచ్చిపోతే అగ్నిగుండంలోకి వెళ్తామన్నది వాస్తవం.  ఇది ఫ్లాట్ ఎర్త్ అయినా రౌండ్ ఎర్త్ అయినా దీని మీద దేవుడు బలైనాడనేది వాస్తవం.  అవసరమైన విషయాలు వదిలేసి! ఇప్పుడు సిలువ మీద యేసు వ్రేలాడినాడని చెప్తే అది టేకు చెక్కతో చేసారా? లేకపోతే దేవధారు మ్రానా? తుమ్మ చెక్కనా? అని దాని మీద చర్చ పెట్టినట్టుంది. ఇదంతా కూడ రామాయణంలో పిడకల వేట అన్నట్టు, అప్రస్తుతమైన అంశాలు. మన రక్షణ ప్రణాళికకు ఏది అవసరమో! మనము రక్షింపబడటానికి ఇంకొకరికి రక్షణలోనికి నడపటానికి ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టాలి. ఇట్లాంటి గాస్సిప్ వస్తానే ఉంటుది. ఒక్కమాట నేను అంటున్నా ఈ Flat Earth గురించి, చంద్రమండలానికి వెళ్ళి, అక్కడనుంచి ఫోటో తీస్తే భూమి గుండ్రంగా బంతిలాగా కనిపించింది. అలాగే Powerful Telescope తో మనం అంతరిక్షంలోని గ్రహాలను ఫోటో తీస్తే ఆ గ్రహాలు కూడ బంతుల్లాగా రౌండ్గా ఉన్నాయి. భూమి కూడ ఒక గ్రహమే! గనుక వీరు చంద్రమండలానికి వెళ్ళి ఫోటో తీస్తే భూమి కూడ బంతిలాగా రౌండ్గా ఉన్నది. అని ఈ విషయం మనం చెబితే, వాళ్ళు, చంద్రమండలానికి వీళ్ళు పోవడమే అబద్ధము. Flat Earth society వారు చంద్రమండలానికి వెళ్ళాం అంటే ఒప్పుకోరు. వాళ్ళు, మీరు పోయింది లేదు, సచ్చింది లేదు.  అదంతా మీరు హాలీవుడ్ సినిమాలాగా షూట్చేసారు. అంతా ఒట్టిదే అని అంటారు.

            సరే, నేనొకమాట వీళ్ళను అడుగుతాను, అంతరిక్షంలోకి పోయి, మనోళ్ళు ఫోటో తీస్తే రౌండ్ కనబడేది అబద్ధం అంటున్నారు కదా? మరి మీరేమన్నా ఫ్లాట్గా ఉన్న ఎర్త్ను ఫోటో తీసారా? వాడు దీన్ని ఖండిస్తే, వీడు, వాడ్ని ఖండిస్తే. ఇది వాదనతో తేలేది కాదు. అప్పుడు భూమి మీద ప్రతి ఒక్కరిని, రాకెట్లో తీసుకెళ్ళి ఇదుగో రౌండ్గా ఉంది అని చూపించాలి. దాని వల్ల లాభము ఎవరికీ? ఇది (భూమి) ఎలా ఉన్నా యేసు ప్రభువు రెండవరాకడ తర్వాత భూమి, దానిమీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. దానివల్ల వాడు సమాజానికి ఏం మేలు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక మేలా? ఆర్థిక మేలా? సామాజికంగా అణచివేయబడ్డ వాళ్ళకు అభివృద్దా? అదంతా వ్యర్ధమైన గాస్సిప్. ఇంటర్నెట్లో కూడ చాలా ప్రయోజనకరమైన అంశాలున్నాయి. ఏదైనా విషయం కావాలంటే WIKIPEDIA ఉన్నది . దాంట్లో The Origin of human race, Origin of different religions , 2 టాపిక్లు ఇంటర్నెట్లో ఉన్నాయి. నేను నిద్రపోయినప్పుడు తప్ప, 24గంటలు ఇంటర్నెట్ వాడుతాను. కాని కొన్ని నేను స్కిప్ (SKIP) చేస్తావుంటా! ఎందుకంటే ఇది గాస్పిస్లోగా ఉంది, దీని వల్ల లాభం లేదు అని. సో. స్వేరింగ్గా మన టైం ఉపయోగించుకుందాము.