130. ప్రశ్న: మనం ప్రార్ధన చేసేటప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఊహించుకుని ప్రార్థన చేయాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:  ప్రార్థన అనే మూడక్షరాల పదము విశ్వమంత విశాలమైనది. ప్రార్ధన గూర్చి ఎంత చెప్పకున్నా తరగదు. మొట్టమొదటి విషయం. మన కళ్ళముందు ఏదైనా ఒక రూపం ఉండాలి. ఉండకపోతే ఏకాగ్రత ఉండదు. అనే ప్రచారము తప్పు. ఎందుకంటే తల్లి గర్భంలో ఒక పిండము తయారవుతుంది. ఇప్పుడు స్కానింగ్ మిషన్, X-ray తీయటం అంతా వచ్చింది. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం, గర్భం మోయుచున్న తల్లి Pregnant Expect- ant mother ఆమె లోపల ఆడపిల్ల తయ్యారవుతుందో, మగ పిల్లవాడు తయ్యారవుతున్నాడో తెలియదు. ఆమె గర్భిణిగా ఉన్నదనగానే ఆమె, ఆమె భర్త ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ గర్భస్థ శిశువు మీద గొప్ప అభిమానం, ఆప్యాయత పెంచుకుంటారు.

            మా పాస్టర్ గారు ‘మా కొడుక్కి పెళ్ళైంది, అమెరికాలో నా కొడలు ప్రెగ్నెంట్. I have not seen my grand child but i love my Grand child. అనేవారు (పాస్టర్ ఫిలిప్ అబ్రహామ్గా గారు, IPC church Pastor) గనుక ఏదో ఒకటి కనబడితేనే, వివరం తెలిస్తేనే నేను అడ్రస్ చేయగలను అనేది వాస్తవం కాదు. ఇప్పుడు విగ్రహ ఆరాధన అనే సబ్జెక్టు ఉంది, వారు విగ్రహం ఎందుకు పెట్టుకుంటారంటే అదే ఉద్దేశ్యంతో, మన తలంపులు చెదిరిపోకుండా ఉండటానికి, మన చూపులు ఒక ఆబ్జెక్ట్ని చూస్తా ఉంటే, మన తలంపులు అక్కడా ఇక్కడా వెళ్ళవని! మరి హిమాలయాల్లో మహర్షులున్నారు. వాళ్ళకేం విగ్రహం ఉండదు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే అంతరాత్మలో ధ్యానం చేసి, పరమాత్మతో మాట్లాడుతుంటారు.

గనుక ప్రార్థన గదిలో మనం మోకరించగానే, మొదటగా మనకొక ఆకారం అవసరం లేదు. స్పష్టికర్త అయినట్వంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు శివపరమాత్మ ప్రజాపతి బ్రహ్మకుమారి సమాజంలోవారు, దేవుడ్ని బిందు స్వరూపుడని ఊహించుకుంటారు. ఒక కాంతి పుంజము. ఒక బిందువు అది శివుడి స్వరూపం, దేవుడి స్వరూపం, సృష్టి, స్థితి, లయ కారకుడాయనే, సర్వం ఆయనే, త్రిమూర్తులు ఆయనే, అన్ని ఆయనే అని Mount Abu లో వాళ్ళ Head Quarters ఉంది. రాజస్తాన్లో! గనుక వారు బిందూ స్వరూపం అంటారు. మరొకరు, ఇంకొకటి అంటారు. ఏదైనా ఒక రూపం కావాలి అని మనం డిమాండ్ చేసే కంటే, ఈ సృష్టిని ఎవరైతే సృష్టించారో, మొత్తం బ్రహ్మండాన్ని సృష్టించారో, ఆయనను నేను ఎరుగను! ఎలా ఉంటాడో నేను చూడలేదు. ఆయనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, మన మైండ్ ఆటోమ్యాటిక్గా ఆయనకు కనెక్ట్ అయిపోతుంది. కళ్ళముందు రూపము లేకుండా కనెక్టు కావొచ్చు. ఏమీ లేకుండా ఎలా కనెక్ట్ అవుతారంటే, అవుతాం! ఆ శక్తి మన మనస్సుకుంది! ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది, వీడియోకాల్స్ చేస్తాము, మరప్పుడు మామూలుగా ట్రంకాలు బుక్ చేసుకుని ఎప్పుడో పిలిస్తే పొయ్యి ఫోన్ చేసేది. అవతలి మనిషి కనబడడు అయినా కూడ మాట్లాడుతున్నాం కదా? For Example అవతల మనిషి మూగవాడు ఫోన్ పట్టుకొని ఉన్నాడు. మాట్లాడడు, మనకు వినబడదు. కానీ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ (Information) చెప్తున్నాం. వెళ్ళి అమ్మగారికి ఈ విషయం చెప్పురా, నువ్వు రాస్కో నేను చెపుతున్నమాట అన్నపుడు Somebody is there he is listening to my voice and words and Understanding

అన్న విశ్వాసంతో మనం కనెక్ట్ అయిపోయి మాట్లాడొచ్చు.

            కాబట్టి దేవుణ్ణి ఎలా ఊహించుకోవాలి అనే ప్రశ్న వద్దు. అసలు ఏ రూపము లేకపోయినా, అగోచరుడైనవానితో మనముందు ఒక రూపంతో రాని వానితో కూడ మన మైండ్ కనెక్టు కావొచ్చు అనేది మొదటి పాయింట్!

            రెండవ పాయింట్ ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు చూసాడు.  అది రాయబడింది. దానియేలు గ్రంథంలో కూడ, మనుష్యకుమారుని పోలిన ఒకడు మేఘాల మీద రావడం మనం చూస్తాం. అలాగే అనేకసార్లు! పరమగీతంలో యేసు ప్రభువు వారు వర్ణించబడ్డారు. ప్రకటన గ్రంథంలో కూడ వర్ణించబడ్డాడు. ఈ వర్ణనలన్నీ బాగా చదివి, చదివి, చదివి, మన కళ్ళముందుకు ఆ రూపం వచ్చిందనుకొండి, తప్పులేదు. అగ్నిజ్వాలలవంటి కన్నులు గలిగినవాడు. అపరంజి వంటి పాదములు కలిగినవాడు మన కళ్ళముందుకొచ్చి నిలబడితే మంచిదే! తప్పు లేదు. నేను ఎరిగి, నాకు అనుభవం అయింది ఏంటంటే రిబ్కా ఎలియేజరుతో కలిసి నడుస్తా ఉంది. ఎలియేజరు రిబ్కాతో, ఇస్సాకు యొక్క స్వరూప స్వభావాలను వర్ణిస్తూ చెబుతూ పోతున్నాడు. వాళ్ళు ప్రయాణం చేసే కొలది ఎలియేజరు మాటలు వింటూ, వింటూ రిబ్కా హృదయ పలక మీద ఇస్సాకు రూపం చిత్రీకరించబడింది. గనుక ఇస్సాకు ఉన్న ప్రదేశానికి వెళ్ళగానే, అక్కడ ఇస్సాకు పొలంలో కనబడగానే, చటుక్కున ముందు ఆమె ఒంటె మీదనుండి దిగి, ముసుగు వేసికొని, ఆ పురుషుడు ఎవరని అడిగింది. దారి మద్యలో ఎందరో పురుషులొచ్చారు. ప్రతి ఒక్కడిని చూడగానే, మగవాడు కనబడగానే, ఒంటే దిగేసి, ఇతనెవరు? ఇతనెవరు? అని అడుగుతా రాలేదామె.  ఒక్క ఇస్సాకును గూర్చి అడిగింది. అడగగానే, ఆమె Expectation (ఎస్పెక్టేషన్) కరెక్ట్ అని తేలింది. ఇతడే మీ యజమానుడు అని చెప్పారు. కనుక అన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళెటప్పుడు, అంతసేపు ఎన్ని రోజుల ప్రయాణమో తెలియదు, ఎలియేజరు ఇస్సాకును గూర్చి చెబుతూ, చెబుతూ ఉన్నాడు గనుక ఇస్సాకును చూడగానే ఇతనే అయ్యిండొచ్చు. నేను విన్న వర్ణన ఇతడికే సరిపోతుంది. అని అనుభూతి కలిగి చటుక్కున ఒంటె దిగింది. ముసుగేసుకున్న తర్వాత అడిగింది. అడిగినాక ముసుగేసుకోలేదు.  ఎవరు? అంటే, ‘ఇతడే మా యజమానుడు? అంటే ‘అవునా’ అని ముసుగేసుకున్నది గాదు. ఆదికాండము 24వ అధ్యాయంలో స్పష్టమైన విషయం ఇది ముసుగేసుకున్నాక అడిగింది.

            అంటే ఆల్రెడీ కన్విన్స్ అయిపోయింది. ఇతడే అయ్యిండొచ్చు అని! అదే అనుభవము సంఘ కన్యకకు కలుగుతుంది. ఇక్కడ రిబ్కాతో సంఘ కన్యక పోల్చబడుతుంది. రిబ్కా సంఘకన్యకు సాదృశ్యము. ఎలీయేజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ అనే ఎలియేజరు, సంఘ కన్యకతో మాట్లాడుతూ, మాట్లాడుతూ నడిపించుకొస్తున్నాడు. ఆత్మ స్వరము వింటున్న కొలది యేసు రూపం ఎలా ఉంటుందో మన హృదయం మీద పేయింటింగ్ జరుగుతా ఉంటుందన్న మాట! ఒకవేళ యేసుప్రభువు ఎదురొస్తే మన హృదయంలో, జ్ఞాపకాల్లో ఉన్నట్వంటి ఆ రూపం కరెక్ట్ మ్యాచ్ అవుతుంది.  గనుక ఇతడే నా ప్రియుడని మనం చెప్పగలుగుతాం. ఆ అనుభవము విశ్వాసులందరికీ, ఒకే స్థాయిలో, ఒకే టైంలో ఉండదు. అసలు ముందు వీళ్ళకు పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి కదా?

ఆశీర్వాదం ఇస్తాం, ‘తండ్రియైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్దాత్మ దేవుని సహవాసం మనకు తోడై ఉందును గాక ! May the fellowship of the holy spirit be with all of us! మరి ఆయనయొక్క సహవాసం ఉంటే రిబ్కాలాగ మనం ఇస్సాకు రూపాన్ని చిత్రీకరించుకొవచ్చు. మరి ఆయన సహవాసం అందరికీ ఉండదు. పరిశుద్ధాత్మ అంటేనే కొంతమందికి ఇష్టం లేదు. అదేదో ఒక చెడ్డమాటలాగ, గనుక క్రైస్తవులందరికి పరిశుద్ధాత్మతో సహవాసం లేదు. అసలు సంఘాలకు, సంఘాలు, డినామినేషన్లకు, డినిమినేషన్లు పరిశుద్ధాత్మాను ద్వేషించే వాళ్ళు ఉన్నారు! కనుక రిబ్కా ఎలా కాగలుగుతారు? కాలేరు!

            అయినా వాళ్ళు కూడ కనెక్టు అవుతారు, ఒక లోయర్ లెవెల్ లో.  పరిశుద్ధాత్మతో సహవాసం చేసినవాడు హైయ్యర్ లెవెల్లో కనెక్టు అవుతాడు ప్రార్థనలో! వీడేమో లోయర్ లెవెల్లో కనెక్ట్ అవుతాడు. అంటే ఒక వందమంది భక్తులు మోకరించి, మనకు ప్రార్థనలో కనబడుతున్నారు. వందమంది ప్రార్ధన చేస్తున్నారు. కాని వంద మంది ప్రార్థనంత ఒకే లెవెల్ కాదు. మనము, మన ప్రక్కన మోషే ప్రార్థన చేస్తుంటే, ఆయన లెవెల్ వేరు. మన లెవెల్ వేరు. కనెక్టయ్యె లెవెల్! ఇక్కడ దానియేలు, యిర్మియా, యెషాయా, పౌలు, మీరు, నేను మార్టిన్లూథర్, భక్తసింగ్ అందరం మోకరిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో దేవునికి కనెక్టవుతారు.  Prayer is itself a Universe.  కాబట్టి మనం ఎలా ఊహించుకోవాలి అంటే మన అవసరాన్ని బట్టి, అతడు పొందిన దెబ్బలవలన మనకు స్వస్థత కొరకు నేను ప్రార్థిస్తున్నాననుకొండి. గాయపరచబడి సిలువలో వ్రేలాడుతున్న నా ప్రభువును, నా మనోనేత్రాల్లో ప్రతిష్టించుకుని ప్రార్థన చేస్తాను.  పాపాన్ని ఖండించే బోధచేస్తున్నాను. అలాంటప్పుడు, నీతిగల న్యాయాధిపతి, న్యాయపీఠము ఆసీనుడైన యేసునాధుని ఊహించుకుంటాను.  కళ్ళముందు ప్రతిష్టించుకుంటాను. న్యాయపీఠాసీనుడైన యేసును ఊహించుకుని రోగిని ‘స్వస్థపరచుమని అడిగితే, ఆ ప్రార్థన అంత కన్వింసింగ్ గా ఉండదు. So, situationally, it varies the level.  అలాగే మనకున్న ఎదుగుదల, మనకున్న పరిస్థితులు, అవసరతలు ఎప్పుడు ఎలాగు అవసరమో మన కళ్ళముందుకు ఆ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడే యేసును తీసుకొస్తాడు.

            అయితే ఏ రూపము లేకున్నా కనెక్టు అవటం ఒకటి! మనకున్న అక్కరకు మ్యాచ్ అయ్యె రూపాన్ని ఆత్మ దేవున్ని తీసుకొచ్చే లెవెల్ బకటి! అలాగ ప్రార్థనైతే ముందు మొదలైతే పెట్టాలి. తర్వాత ఎక్కాల్సినవి లక్షల మెట్లు ఉంటాయి.