131. ప్రశ్న: ఆదికాండము 3:15లో స్త్రీ సంతానముగా యేసుప్రభువు కనిపిస్తున్నారు కదా? ఆయన స్త్రీ సంతానమునుండి మనిషిగా వచ్చాడు. అలాగే ఇప్పుడు సర్ప సంతానము కూడ ఉంది కదా? ఇప్పుడు మరి ఆ సర్ప సంతానము ఏ స్త్రీ నుండి వచ్చింది? అంటే నాకర్థం కాక అడుగుతున్నాను. ఈ ప్రశ్న అడగటానికి కారణం ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్త్రీ నుండి కచ్చితంగా వచ్చారు. మరియ గర్భాన పరిశుద్ధంగా జీవించాడు. మరి అక్కడ ఖచ్చితంగా సర్పసంతానము కనిపిస్తూ ఉండాలి కదా? ఒక పాస్టర్గారు, సర్పసంతానాన్ని ఆత్మీయంగా చూపుతున్నారు.  సర్పసంతానము భౌతికంగా ఇక్కడ చూపించకపోతే వాక్యం వ్యర్థం అయిపోతుంది కదా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:  మీరు మీ తర్కంలో సరిగా లైన్లోనే ఉన్నారు.  మీ తర్కంలో! అందుకొరకే సర్పసంతానము, ఆత్మసంబంధము, ఆధ్యాత్మికమైతే గనుక స్త్రీ సంతానము కూడ ఆత్మసంబంధమై ఉండాలి. భౌతికంగా ఏం ఉండకూడదు. స్త్రీ సంతానమైన యేసు భౌతికంగా ఒక శరీరంగా మానవ చరిత్రలో ఉన్నాడు. గనుక సర్పసంతానమైన మనిషి కూడ ఉండాలి. అయితే ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం ‘యుగాంతం’ అనే బుక్కులో రాసాను.

            కూషు, నిమ్రోదును కనెను అని ఆదికాండము 10లో వ్రాయబడి ఉంది. నోవాహుయొక్క ముగ్గురు కుమారుల వంశావళి సందర్భంగా, నోవాహుకు ముగ్గురు కొడుకులు షేము, హాము యాసేతు. ఆ షేము పిల్లలలోనుండి కొన్ని అరబ్బు, యూద జాతి వచ్చారు. యాపేతులోనుండి యూరోపియన్, ఆర్యన్, ఇండో ఆర్యన్ తెగ, అక్కడ వారు సముద్ర తీరమునందు ఉన్నట్వంటి గోమెరు, రోషు, మాగోగు. అవన్ని పేర్లు మీకక్కడ కనిపిస్తాయి. తర్వాత హాము అనేవాడు, మధ్యలోవాడు.  వాడిలోనుండి వచ్చిన ఒకడు కూషు. ఈ కూషు అనే వాడు నిమ్రోదును కన్నాడు. నిమ్రోదు అనేవాడు భూమి మీద మొట్టమొదటి మానవ ప్రభుత్వ స్థాపకుడు. మానవ భరణయుగం నిమ్రోదుతోనే మొదలైంది. The Age of human government అంటారు. మనుష్యులు ప్రభుత్వం చేయటం రాజులు కావటం వాడితో మొదలైంది. వాడు బాబేలు గోపురాన్ని కట్టించాడు. అష్షూరు (Ashuru) రాజ్యాన్ని స్థాపించాడు. బబులోను రాజ్యానికి స్థాపకుడు వాడే. నీనెవె మహాపురాన్ని కట్టించాడు. వాడే మొట్టమొదటి నగర నిర్మాణకుడు. తర్వాత మన రాజులు. ఆదికాండము 10వ అధ్యాయము సంగతి చెప్పాను ఇప్పుడు.

            కాని నాలుగు అధ్యాయాలు వెనక్కి వెళితే ఆరవ ఆధ్యాయంలో భూమి మీద నెఫీలిలు అనే బలాత్కారులు, బలవంతులు, రాక్షసులున్నారు. 6వ అధ్యాయంలోనే రాక్షసులున్నారు. 7,8,9 దాటి పదవ అధ్యాయంలో నిమ్రోదు రాజ్యం స్థాపించాడు. ఈ ఒకొక్కడు 60-70 అడుగుల ఎత్తున్న తాటిచెట్టంత ఎత్తున్న మహారాక్షసుల కాలంలో నిమ్రోదు రాజ్యం స్థాపిస్తే రాక్షసులు ఊరుకుంటారా? వారు వీన్ని విరుచుకుని తినేస్తారు. వాడు మనలాంటి మనిషికాదు. వాడు కూడ రాక్షసులను భయపెట్టి లోబరచుకున్నట్వంటి మహారాక్షసుడు వాడు. అయితే వాడు, “నేనే దేవుణ్ణి’ అని చెప్పుకున్నాడు. వాడు కట్టించిన బాబేలు గోపురము ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉన్నది. ఇరాక్ దేశంలో బాబేలు గోపురము త్రవ్వకాల్లో బయటపడ్డాయి. తవ్వకాల్లో పునాదులు బయటపడ్డాయి. అక్కడ వీడు రాసిన రాజశాసనాలు ఉన్నాయి.

            వాడు, ‘నిమ్రోదు అనే నేను సూర్యదేవుని అవతారాన్ని, మా ఆవిడ ఆకాశరాణి, మా కొడుకు తమ్ముజు అనేవాడు స్త్రీ సంతానము, లోక విమోచన రక్షకుడు వీడే అని, ఇప్పుడు యోసేపు, మరియమ్మ, యేసుప్రభు బొమ్మలు క్యతోలిక్ చర్చిలో ఉంటాయి కదా? సేమ్ అవే విగ్రహాలు బయటపడ్డాయి.

            అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాడు మాములు మనిషి కాడు. రాక్షసులు జీవించినట్వంటి కాలంలోనే రాజ్యమేలినట్వంటి మహారాజు, నిమ్రోదు! వాడు రాక్షసులను మించిన రాక్షసుడు.  గనుక, వాడే సర్ప సంతానము, వాడే రేపు రాబోతున్న ‘క్రీస్తు విరోధి’. ఈ విషయాన్ని నేను నిరూపించి చెప్పాను. మీకా 5వ అధ్యాయంలో, అంత్యదినములలో యేసుప్రభువు వచ్చినప్పుడు నిమ్రోదు దేశమును ఖడ్గముతో మేపుతాడని రాయబడి ఉంది. దయచేసి నా ‘యుగాంతం’ బుక్కు చదవండి! నిమ్రోదు గురించి అందులో ఫుల్ సమాచారం ఉంటుంది.

            స్త్రీ సంతానమేమో యేసుక్రీస్తు.  సర్పమునకు అంటే లూసీఫర్ కు పుట్టినటువంటి వాడు నిమ్రోదు.  కూషు భార్య ఉంది చూసారూ.  కూషు భార్యతో వాడు అక్రమముగా సంతానము కన్నాడు. వాడు నిమ్రోదు! అంటే సైతాను, సర్పమే! ఆదిమహాఘట సర్పమే, కూషూ భార్యతో అక్రమ సంపర్కం పెట్టుకుంటే ఆమెకు గర్భం వచ్చింది. ఆమె కన్నట్వంటి కుమారుడు ఇప్పుడు భౌతికమైన నిమ్రోదే మీరన్న సర్ప సంతానం. కూషూ భార్యే సర్పసంతానమైన వారియొక్క తల్లి!

            దేవుడైతే స్త్రీ లేకుండా కొడుకును కన్నాడు. వీడికి స్త్రీ కావాలి. అలా వాడు కూషు భార్య ద్వారా కొడుకును కన్నాడు. వాడికి సమస్తము అప్పగించాలని సైతాను ప్రయత్నం చేస్తున్నాడు. రేపు రాబోయే ప్రపంచ నియంత, అబద్ధక్రీస్తు వాడే!