❓ ప్రశ్న: “రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును” (కీర్తన 121) అన్న దేవుడు ఉన్నప్పుడు క్రైస్తవులకు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? మనం దేవుడిని వాగ్దానాల కోసం నమ్మామా లేక సిలువ కోసం నమ్మామా? (1:13:35)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 00s)
- 🛡️ నరకం నుండి రక్షణ: మనం యేసును నమ్మింది యాక్సిడెంట్లు జరగకూడదు అని కాదు. మన పాపాల వల్ల కలిగే అగ్నిగుండం నుండి రక్షణ పొందుతామని నమ్మాము. రక్షణ కోసం నమ్మాము తప్ప లోకపు గ్యారెంటీ (Guarantees) ల కోసం కాదు.
- 🧱 సమయం – సందర్భం: బైబిల్ వాగ్దానాలన్నీ దేవుని చిత్తము మరియు సమయాన్ని బట్టి నెరవేరుతాయి. ఒకరికి 30 ఏళ్ల ఆయుష్షు అని దేవుడు రాసి పెడితే.. ఆ సమయానికి ఏదో ఒక రూపంలో మరణం సంభవిస్తుంది. దీర్ఘాయువు ఇస్తానని ఉన్నా.. 27 ఏళ్లకే చనిపోయిన భక్తులు (డేవిడ్ బ్రెనార్డ్ వంటి వారు) ఎందరో ఉన్నారు.
- ⚖️ సిలువనే చూసి: బైబిల్ లోని గ్యారెంటీలు చూసి ఎవ్వడూ ఏసుప్రభువుని నమ్మలేదు. మేమంతా పాపులమని గ్రహించి, మా జరిమానా సిలువలో క్రీస్తు చెల్లించారని గ్రహించి ఆయనను నమ్మాము. ప్రమాదం జరిగినంత మాత్రాన దేవుడిని వదిలేయడం తెలివితక్కువ వాదన. పుష్కరాల్లో చనిపోతే దేవుడిని వదిలేస్తారా? లేదు. మా అబ్బాయి ముందు వెళ్ళాడు నేను వెనక్కి వెళ్తాను అనేదే క్రైస్తవ నిరీక్షణ.
Detailed English Translation:
❓ Question: If God promises to keep our going out and coming in, why do Christians face accidents?
- Primary Salvation: We embraced Christ to escape eternal hell, not earthly accidents.
- Divine Sovereignty: All promises are subject to God’s will. If a person’s time is up, they will pass away.
- Anchor in the Cross: We follow Jesus because of the sacrifice on the Cross, not for worldly insurance. Our hope is eternal.
