133. ప్రశ్న: ఈ మధ్య రెండు సంఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. ఒక యం.ఆర్.ఓ.(MRO) గారిని యువరైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన! రెండవది, నిన్నటి దినమున ప్రియాంకా రెడ్డి, వెటర్నెటీ డాక్టర్గారు వస్తుంటే నలుగురు దుండగులు కలిసి హత్యచేసి మరి ఘోరాతిఘోరంగా చంపేసారు. ఈ సంఘటనలు ప్రజలు ఏ విధంగా ఎదుర్కొవాలి? మహిళలు ఏ విధంగా ఎదురుకోవాల్సిన అవసరం ఉంది? దీనిమీద మీ స్పందన ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: దీన్ని స్పెషల్గా నేను స్పందిచాల్సిన విషయము, నేను ప్రత్యేంగా స్పందించడం ఏమీ ఉండదు. మానవత్వం ఉన్న మనిషిగా, నేను సమాజంలో కోట్ల మందితోపాటు ఇలాంటి సంఘటనల పట్ల I cried with (blood) in my eyes. చాలా ఘోరం, చాలా దారుణం. ఏ మాత్రము మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా సరే! గుండెలు పగిలేటట్లు రోదించవలసిన విషాదాలివి!

          ఇప్పుడు (MRO) గురించి అంటారేంటంటే, ఆమె చాలా రోజులనుండి అతన్ని పాస్బుక్కు ఇవ్వకుండా రికార్డు రెగులరైజ్ కాకుండా ఆమె అతన్ని సతాయించింది. రెవెన్యు డిపార్ట్మెంట్లో చాలా కరప్షన్ నడుస్తా ఉన్నది. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని చెయ్యరు. అందులో ఆమె కూడ యం.ఆర్.వో.గారు అతన్ని చాలా సతాయించింది. గనుక అలా చేసాడని చెప్పేవాళ్ళున్నారు. ఏది ఏమైనా, ఆమె ఒక కరప్ట్ ఆఫీసర్ అవునో? కాదో? మనకు తెలీదు.  Dont know! It is simply one of the charges made against her! One of the stories told regarding her particular incident! but we dont know whether she is corrupt? or not? ఒకవేళా ఆమె మోస్ట్ కరప్ట్ అయింటే కూడా ఆ  విధంగా చెయ్యకూడదు. దాన్ని మనం సమర్థించలేం! ఇప్పుడు గ్రాహంస్టేన్స్ గారిని సజీవ దహనం చేసి చంపారు, ధారాసింగ్ అనుచరులు! వాళ్ళెవరో లొకేట్ చేసాం. అయినా సరే వాళ్ళను అట్లానే పెట్రోల్ పోసి తగులబెట్టాలని క్రైస్తవులు ఎవ్వరు అనుకోలేదు. Nobody, even dreamt about that. గ్రహం స్టేన్స్ గారి సతీమణి, అమ్మగారు కూడ ఏమన్నారంటే ‘నా భర్తను చంపినవాడ్ని నేను క్షమించేస్తున్నా, నాకు భాధాకరమే, నా భర్తను, ఇద్దరు కొడుకులను ఒకటే సారి పోగొట్టుకున్నాను, దేవుడే తీర్పు తీర్చును.  మీరు వారినేం అనొద్దు’ అన్నారు. అంటే అటువంటి దుర్మార్గులకు కూడ పెట్రోల్ పోసి, తగులబెట్టాలని థాట్ ఎవరికి లేదు! అటువంటి దారుణమైన హత్య అలాగ ఒకరి నిండు ప్రాణం తీసుకోవడం చాలా తప్పు. దాన్ని మనం ఎప్పుడూ సమర్థించలేం! ఇంకోసారి అలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం, మూడు చర్యలు తీసుకోవాలి!

1. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడ కరప్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి  ప్రభుత్వం, ఈ దిశలో విశేషమైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళను మేము ‘రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్’, ఆర్.కె.పి.(R.K.P.) అధినేతగా, ఇండియా ప్రజాబంధు పార్టీ (IPBP) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా, ఒక క్రైస్తవుడుగా, ఒక భారతీయ పౌరుడిగా మేము అభినందిస్తున్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబరు క్రియేట్ చేసి వదిలారు! ప్రభుత్వంలో ఏ అధికారియైనా సరే, లంచం అడిగితే ముందు ఈ నెంబర్కు ఫోన్ చెయ్యండి అని! ఒక్కసారిగా ఎ.పీలో లంచగొండి తనం తక్కువగా వచ్చేసింది. అక్కడ Almost corruption cases వినబడటం లేదు! అటువంటి చర్యలు, తెలంగాణరాష్ట్రంలో, మొత్తం భారతదేశం 29 రాష్ట్రాల్లో కూడ అటువంటి చర్యలు చేపట్టాలి. ఒకప్పుడు జగన్గారంటే, చిన్నవాడు వయస్సు లేదు, అనుభవం లేదు, తండ్రికున్న అంతస్థు, స్థాయి లేదు. అని మాట్లాడారు. ఇప్పుడు దేశం మాత్రం ఆయనను ఆదర్శంగా తీసుకునే ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగారు.

2. కరప్షన్ తగ్గిస్తూ, ఒకవేళ ఏదైనా నేరం జరిగితే చట్టపరంగా చర్యలు ఎలా తీసుకోవాలో ఈ విషయంలో పౌరులందరికి కూడ ఎడ్యుకేట్ చెయ్యాలి.

3. ఇంత ఎడ్యుకేట్ చేసినా, అది పట్టించుకోకుండా ఉండి దుండగులు ఎవరైనా ఉండొచ్చు, క్షణిక అవేశం బట్టో, చాలా రోజులు నలిగిపోయి, విసిగిపోయి, కక్ష్య ద్వేషం పెంచుకునో ఇట్లాగ చెయ్యాలనుకున్న వాళ్ళు అలా చెయ్యడానికి వీలు లేకుండా, All government offices లో సెక్యూరిటీ పెంచాలి. సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ గేట్ దగ్గర కూర్చొని, గోడకు ఆనుకొని, నిద్రపోవడం అనే పద్ధతి తీసేసి, అభ్యంతరకరమైన, ఈ Inflammable నిప్పు దగ్గర పెడితే బగ్గుమని మండేట్వంటి లిక్వెడ్స్, ఫ్లూయిడ్స్, మెటల్, కత్తులు, కటారులుగాని లోపలికి వస్తే ఆ మెటల్ డిటెక్టర్, Inflammable detector సైరన్ మ్రోగే Electroic Security systems పెట్టాలి. ఎవ్వడొచ్చిన దానిగుండా రావాలి. ఇటువంటివి ఏమైనా ఉంటే, సైరన్ మొత్తుకుంటుంది, అతన్ని అదుపులోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడ ప్రభుత్వం రక్షణ కల్పించాలి. సో ఈ మూడు విషయాలు జరగాలి.

ఇక ప్రియాంక రెడ్డిదైతే మరీ దారుణం నలుగురు దుండగులు కలిసి ఒకరితర్వాత ఒకరు రేప్ చేసి తర్వాత మెడకు చున్ని వేసి బిగించారు. తలమీద పెద్ద బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చారు. ఆమె వస్తువులను బట్టి ప్రియాంక రెడ్డి అని తెలిసింది.  తప్ప ఆమె ఆనావాళ్ళు లేవు. వాళ్ళందరు చాలా యంగ్. పెద్ద ముదిరిపోయిన నేరస్తులు కారు. అత్యంత తీవ్రంగా దోషులను శిక్షించాలి. మొదటినుండి IPBP వేదికల మీద, మా పార్టీ మ్యానిఫెస్టోలో ఒకటే డిమాండ్ ‘రేపిస్టులను కఠినంగా శిక్షించాలి ’ ఎంత కఠినంగా అంటే గజగజ వణికి చావాలి వాడు! అంత భయంకరమైన శిక్ష రేపిస్టులకు వేయ్యాలి. మరణశిక్ష మాత్రమే కాదు, మరణంకంటే మగవాడికి భయంకరమైన శిక్ష ‘మర్మాంగ ఖండన’! అంత ఘోరమైన శిక్ష వేస్తే తప్ప, ఇల్లాంటివి జరుగుతానే ఉంటాయి.

            నిర్భయ అనే అమ్మాయి రేప్ మరియు మర్డర్ జరిగింది.  ఆ తర్వాత నిర్భయా చట్టం వచ్చింది. ఇప్పుడు అది వచ్చినా సరే! ఆ తర్వాత ఎన్ని జరిగినాయి? వందలు, వేలు జరిగినాయి.  గనుక ఇప్పుడు చట్టాలు మాత్రమే కాదు, చట్టాలు అమలు చేయటంకావాలి. చట్టాలు అమలు చేసే అధికార యంత్రాంగం కావాలి. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం తొందరగా మేల్కొని అసీఫాభాను విషయంలో న్యాయం చేకూర్చాలి. రేపిస్తును కొంతకాలం ఇంటి అల్లునిలాగా లోపలబెట్టి భోజనాలు బెట్టి మళ్ళీ బయటకు వదిలారు. అలాగ ఏ రేపిస్టు అయినా అంతే! 2-3 ఏండ్లు లోపలుంటాడు. బెయిల్ మీద బయటకొస్తాడు. జీవితాకాలం శిక్ష పడనే పడదు. ఏమైందో, శిక్ష అమలు అయిందో? లేదో? తెలీదు. దేశంలో వేలమంది రేపిస్టులు రోడ్లమీద తప్పించుకుని తిరుగుతున్నారు. ఏం భయం ఉంటుంది. దొరికినవాళ్ళని ఏం చేస్తారు? చాలా కఠినంగా శిక్షించాలి. ఇది నా డిమాండ్!

            ఇంకో విషయం చెబుతున్నా, ఆడపిల్లలందరికి నిర్భయంగా మీరు సంచరించకండి! ఒంటరిగా మీరు ఎక్కడికి వెళ్ళకండి! ఇప్పుడు జరుగుతున్నది జనారణ్యం ఇది. ఇందులో మనుషులు అడవిలో మృగాలకంటే కూడ ఘోరం! గనుక ఫరవాలేదులే అని ఒంటరిగా సంచరించకండీ. అంత సంస్కారమంతమైన దేశం మనదికాదు,సొసైటీ మనది కాదు! ‘భారతామాతాకి జై’ అంటారు తప్ప ఆడవాళ్ళమీద గౌరవం లేనట్వంటి దుష్టులు, దుర్మార్గులు, అధికారాలు చెలాయిస్తున్నట్వంటి భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.

            అధికారం చెలాయిస్తున్న పార్టీ నాయకులే, రేపులు-గీపులు జరుగుతాయిలే! పెద్ద ఇష్యు చేయకండీ అని, అది మన సంస్కృతిలో భాగం అని ఆడోల్లే, ప్రకటిస్తున్న సమాజం ఇది. దయచేసి మన చుట్టు ఉన్న సమాజాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. దయచేసి మీరు ఒంటరిగా రాత్రివేళ ఎక్కడికి మీరు వెళ్ళకండి. మన దేశం అంత సంస్కారవంతం  కాలేదు. Be safer side all the time.

            ఇప్పుడు అపరిచితుడు ఎవడో వచ్చి ప్రియాంకా రెడ్డిని అడిగాడంటా, మీ స్కూటీని నేను రిపేర్ చేసి తీసుకొస్తాననీ, వాడు మళ్ళీ ఒంటిగానే తెచ్చిచ్చాడు. ఈమెను చూసి మళ్ళీ వాళ్ళు ఫ్లాన్ చేసుకున్నారు. అలాంటప్పుడు. అలా చేసేకంటే అమ్మాయి, నా స్కూటీ చెడిపోయిందని చెప్పి 100 కి ఫోన్ చెయ్యడమో, లేక ఇంకేదైనా సెక్యూరిటీ చర్య తీసుకోవడమో ప్రికాషనరీగా అంతా బాగుండేది. అంటే అమాయకురాలు నమ్మేసింది. నన్నెవరేం చేస్తారు? అని నన్ను ఎవరేం చెయ్యరు అనుకోవద్దు! నేనొక మగొడినై చెబుతున్నా! అసలు యే మగవాడ్ని నమ్మోద్దు! నన్ను కూడ నమ్మకండి. ఎవర్ని నమ్మకండి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి.  మీకు దండం పెట్టి చేసే సలహా, విజ్ఞప్తి!