(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఎగరడం అంటే కరక్టేగా ఎగరడం ఉన్నది, కరెక్టుకాని ఎగరడం ఉన్నది. ఆత్మ వశుడైనవాడు కదలకుండా వుండాలనే రూలు లేదు. తప్పకుండా కదలాలనే రూలు లేదు. ఆత్మవశుడై దావీదు మహారాజు నాట్యం ఆడాడు. ఆదిమ సంఘంలో కూడ అలాంటి పరిస్థితి జరిగితే పౌలు, ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనమందున్నవి. సంఘములన్నిట్లా దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకే కర్త అని చెప్పాడు. గనుక ఎగిరినా దూకినా దానికంటూ ఒక కంట్రోల్ ఉంటుంది. ఒక క్రమం ఉంటుంది. కదలకుండా వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ కూర్చోలేదు! ప్రాణం ఉన్నోడు కదులుతానే ఉంటాడు ప్రభును ఆరాధించేటప్పుడు మనం కదులుతాం, చేస్తాం పరువాలేదు.
అయితే మొత్తం కట్టు తప్పి ఒంటిమీద బట్టలున్నాయా? లేదా? అన్న స్పృహ లేకుండా అంత వికారంగా చేయకూడదు. మనకొచ్చే ఆవేశము, ఆనందము, ఆ నాట్యం, దేవునిలో మనం ఎగరడం కొంత కంట్రోల్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంట్రోల్ లేకుండా చెయ్యడు. పరిశుద్ధాత్మ వచ్చినా మనకంటు వచ్చినా వంటి మీద బట్ట ఉందా లేదా? అనే స్పృహ ఉంటుంది. పడుతున్నామా? తీస్తున్నామా? ప్రక్కన ఆడవాళ్ళున్నారా? పడుతున్నామా? స్పృహ ఉంటుంది. నేను పెంతెకోస్తోన్నే. నేను పరిశుద్ధాత్మ పొంది, ఇప్పుడు 50 సంవత్సరాలైంది. నేను నాట్యం ఆడుతా, ఆనందిస్తా. కాని నేను పోయి పక్కన ఆడోళ్ళమీద పడటము, నా లుంగీపంచ ఊడిపోవడం ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. L am in my own control. ప్రభువుతో ఆనందిస్తాను. మళ్ళీ కంట్రోల్గా ఉంటాను. మన సంఘాలు అన్నింటికి నేను నేర్పించిన పద్దతులే! అయితే కొన్ని సంఘాల్లో out of control అయిపోతుంది. అలా ఉండకూడదు. వాళ్ళ గురువులు వాళ్ళకు నేర్పించుకోవాలి. ఒక్కొక్కసారి భ్రమ పరిచారకులు వచ్చినప్పుడు అసలు కంట్రోల్ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని మాత్రం మనకు అవమానం కాకుండా, అక్రమం కాకుండా మన స్వాధీనంలో మనం ఉండేటట్టే చేస్తాడు.
