1372.Q: Offerings to Idols – Biblical Liberty 🍎

❓ ప్రశ్న: విగ్రహార్పితం (ప్రసాదం) తినడం విషయంలో పౌలు ఇచ్చిన అద్భుతమైన క్లారిటీ ఏంటి? మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినవచ్చా? (1:15:43)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 44s)

  • 🛡️ నిర్జీవ పదార్థం: మొదటి కోరింథీ 8వ అధ్యాయం ప్రకారం లోకమందు విగ్రహము ఒట్టిదే. ప్రసాదంలో దయ్యం ఉండదు, అది కేవలం నిర్జీవ పదార్థం మాత్రమే. తిన్నా తక్కువ లేదు, తినకపోయినా ఎక్కువ లేదు. కానీ ఈ జ్ఞానం అందరికీ లేదు.
  • 🧱 సాక్ష్యం కోసం: మొదటి కోరింథీ 10:27 ప్రకారం—అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మనసు ఉంటే ఏ విచారణ చేయకుండా తినవచ్చు. కానీ ఒకవేళ ఎదుటివాడు ఇది ‘ప్రసాదం’ అని చెబితే.. వాని మనస్సాక్షి కోసం (మన కోసం కాదు) తినకూడదు. ఎందుకంటే మనం తింటే—యేసు దేవుడు, అన్య దేవతలు అందరూ సమానమే అని వాడు పొరబడతాడు. యేసు అందరికంటే ఔన్నత్యము పొందినవాడు అని సాక్ష్యం ఇవ్వడానికే మనం వద్దంటాం.
  • ⚖️ ప్రార్థనతో పవిత్రత: సమస్త వస్తువులు దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడతాయి (1 తిమోతి 4:5). హోటల్ లో పూజ చేసినా, బస్సు డ్రైవర్ పూజ చేసినా.. మనం యేసు రక్తం జయమని ప్రార్థన చేసి వాడుకోవచ్చు. తెలియకుండా తింటే భ్రష్టం అయిపోతాం అని భయపడక్కర్లేదు. కానీ తెలుసుకొని తినడం మన ఇష్టదైవం యేసయ్యకు ఇచ్చే గౌరవం కాదు.

Detailed English Translation:

❓ Question: What is Paul’s clarity on eating food offered to idols? Can we eat without questioning?

  • Idols are Nothing: 1 Corinthians 8 explains that idols have no real power and food offered to them doesn’t spiritually change.
  • Conscience Rule: If an unbeliever invites you, eat without inquiry. But if they specify it’s an offering, refrain—not for your sake, but to ensure they don’t think Jesus is equal to idols. Refusal is a testimony of Christ’s supremacy.
  • Sanctification: All food is sanctified by prayer (1 Timothy 4:5). No external ritual can defile a believer protected by Christ’s blood. We avoid known offerings to show exclusive devotion to Jesus, not out of fear of contamination.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram