❓ ప్రశ్న: ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ‘ఆడ ఏసుప్రభువు’ ఉదంతాన్ని ఎలా చూడాలి? ఇది అంత్యకాలపు మోసాలకు సూచననా? (0:07:20)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 40s)
- 🛡️ ప్రవచన నెరవేర్పు: ఎందుకు జరగకపోతే మరి ఇంకేం జరుగుతది? అది యేసుప్రభువు యొక్క ప్రవచన నెరవేర్పు. యేసుప్రభు రాకడకు సూచనగా యేసుప్రభువు చెప్పారు కదా.. మత్తయి సువార్త 24వ అధ్యాయము నాలుగు, ఐదు వచనాలు. “యేసు వారితో ఇట్లనెను – ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.”
- 🧱 అబద్ధ క్రీస్తుల రాక: మరి ఇది ఆయన ప్రభువు చెప్పారు గనుక అనేకమంది అబద్ధ క్రీస్తులు వస్తారు.. రావాలి. వస్తేనే ప్రభువు వెనుక వస్తున్నాడని ఒక సూచన. ఈమె ఏసుక్రీస్తు ఏమి కాదు, కానీ ఏసుక్రీస్తు రాకడకు ఈమె ఒక సూచన.. అబద్ధ క్రీస్తులలో ఈమె ఒకటి. ఇంతవరకు చాలా మగ అబద్ధ క్రీస్తులు వచ్చారు, ఇప్పుడు ఒక ఆడ అబద్ధ క్రీస్తు కూడా వస్తుంది. కనుక దాన్ని చూసి నవ్వుకోవాలి కానీ దానికి పాస్టర్లు కలవరపడడం ఏముంది?
- ⚖️ సత్యము vs సోది: లేఖన సారాంశం, గూడార్థము అని ఎన్ని నిరూపణలతో చెప్పినా అది రుచించదు.. ఇట్లాంటి సోది రుచిస్తది అందరికీ. జనులు సత్యానికి చెవునివ్వరు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. సత్యానికి చెవునివ్వరు.. దురద చెవులు. అట్లాంటి వాళ్ళకి చాలామంది ఫాలోయింగ్ తొందరగా ఏర్పడుతుంది. కానీ అది చాలా కాలం నిలవదు. ఆమెను వెంబడించినోళ్ళు కూడా భ్రష్టులు అయిపోతారు. అది దురాత్మ.. భ్రమింపజేసే ఒక ఆత్మ పట్టింది ఆమెకు. నేను చూసాను ఆ వీడియో.. షి ఈజ్ ఏ పోసెస్డ్ ఉమెన్ (Possessed woman).
- 👺 సాతాను శోధన: ఒక పడిపోయిన దేవదూత, ఒక దురాత్మ రూపంలో ఆమెలోకి దూరింది. ఏసుప్రభువు కాదు ఏమి కాదు, దాని గురించి ఇంకా రెండో మాట లేనేలేదు. ఆమెనే దాన్ని (దురాత్మను) ఆహ్వానించి ఉంటే విడుదల కలగదు. మామూలుగా దయ్యం పట్టడం వేరు.. కొంతమంది ఏంటంటే, కొంతమందిని సాతాను శోధిస్తాడు – “నీ దేహాన్ని నాకు అప్పగించు, నేను నీకు డబ్బు, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు అన్ని ఇచ్చి నిన్ను ఒక దేవతను చేస్తాను” అని అడుగుతాడు.
- ☁️ బైబిల్ ప్రామాణికం: బైబిల్ నాకు ప్రామాణికం అనుకున్న ప్రతి ఒక్కరు.. యేసే నా రక్షకుడు నిజమైన దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు ఆచి తూచి అడుగేయాలి. బైబిల్ చదవాలి, పరిశోధించాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టి భూమిమీద మళ్ళీ పెరిగి వచ్చినవాడు ఎవ్వడు కూడా ఏసుక్రీస్తు కావడానికి వీలు లేదు. ఒక మాతృ గర్భంలో పుట్టడం అనేది మెస్సీయకు ఒక్కసారి జరిగిపోయింది. రెండవసారి ఆయన ఏ రీతిగా ఒలీవల కొండ మీద నుండి వెళ్ళాడో, అదే రీతిగా మేఘాల మీద వస్తాడు. తల్లి గర్భం ద్వారా రాడు. అదంతా భ్రమింపజేసే ఒక దురాత్మ.
Detailed English Translation:
❓ Question: How should we perceive the recent viral claims of a ‘Female Christ’? Is this a sign of end-time deception?
- Prophetic Fulfillment: Why wouldn’t this happen? It is the fulfillment of the Lord’s prophecy. Jesus warned in Matthew 24:4-5, “Take heed that no one deceives you. For many will come in My name, saying, ‘I am the Christ,’ and will deceive many.” Her arrival is simply one of the signs that the true Lord is coming soon. She is not Christ but a sign of His return. We should laugh at such claims rather than worry.
- Itching Ears: People often prefer sensationalism over scriptural truth. As the Bible says, they have ‘itching ears’ and seek teachers who satisfy their own desires. From the video, it’s evident she is a possessed woman. A fallen angel has entered her body and is speaking through her. If she has personally invited this spirit for fame and money, deliverance is unlikely. Those following her are heading toward spiritual ruin.
- Biblical Standard: Anyone who takes the Bible as their standard must be cautious. No person born of human parents and raised on this earth can be Jesus Christ. The Messiah’s birth from a human womb was a one-time event. His second coming will be on the clouds, just as He ascended from the Mount of Olives. Any claim otherwise is a deception from an evil spirit.
📞 దైవజనులతో మాట్లాడాలనుకున్నా లేదా మీ ప్రశ్నలు పంపాలనుకున్నా 9000083219 నంబర్‌కు WhatsApp కాల్ లేదా మెసేజ్ చేయవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక సందేహాల నివృత్తి కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 🙏
