(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దీనికి కూడా నేను సమాధానం లోగడ నా గ్రంథాలలో చెప్పాను. మళ్ళీ చెపుతాను. విషయం ఏంటంటే చాలా చోట్ల spoken messages లో కూడ చెప్పాను ఈ విషయము. సాతాను ఒక మహా మేధావి. He is only next to God. Created intelligences లో అందరికన్నవాడు superior. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అని దేవుడే యెహెజ్కేలు 28వ అధ్యాయములో మెచ్చుకుంటాడు. అందుచేత వాడు దుష్ట మేదావి. Evil genius అన్నమాట. వాడు ఏదైనా తప్పు చేయాలి అనుకున్నప్పుడు వాడు ఆ తప్పు వేరే వాళ్ళతో చేయిస్తాడు. చేయించి ఆ సింహసనం మీద కూర్చున, పెద్దాయన ఈ తప్పు జరిగితే ఎలా react అవుతాడు అని వాడు నిఘాపెడతాడన్నమాట. ఒక వేళ చాలా wild గా react అయ్యాడనుకో వాడు చెయ్యడు. లేదు ఆయన పెద్దగా react అవలే అనుకో ఆహా ఇది మనం చేస్తే పరవాలేదన్నమాట అనుకొని చేస్తాడు. వీడికి react అవుతే అప్పుడు అడుగుతాడు వాడేమో నీకు చుట్టము నేను దూరమా? వాడు చేస్తే అదే తప్పుకు ఏం అనలేవు. నన్నెందుకు అంటున్నావు అంటాడు మళ్ళీ. అలాంటి Wicked genius వాడు. అయితే వాడికి ఏం కావాలంటే ఒక కొడుకు కావాలి. దేవుడు మొదటినుండి ఆదిసంభూతుడు. ఇదిగో నా కుమారుడు నేను నిన్ను కంటిని నీవు అడుగుము నీకు జనములను సొత్తుగా స్వాస్థ్యముగా ఇచ్చెదను. ఈలాగు దేవదూతల్లో ఎవరితోనైనా చెప్పెనా? ఎవరితో చెప్పలేదు. ఇవన్నీ బైబిల్ లో ఉన్న లేఖనాలు. ఇది 2వ కీర్తన తరువాత హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో దాన్ని ఉటంకించి వ్రాసాడు. గనుక దేవుడు తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇది హెబ్రీ మొదటి అధ్యాయములో ఉంది. ఎందుకయ్యా వారసుడంటే నాలోని అంశ, నా కుమారుడు గనుక. నా కుమారుడికి కళ్యాణం జరగాలి, ఒక భక్త సమాజం ఒక వధువు సంఘం కావాలి. తరువాత మహిమ గల సృష్టి చేస్తాను. అలాగ దేవుడు తన ప్రణాళికను రచించి ప్రకటిస్తూ ఉంటే వీడనుకున్నాడేంటంటే నాకు కూడా ఒక కొడుకు ఉండాలి. మరెలాగు పుడతాడు? దేవుడేమో నోరు ఆవలించి నోరు తెరిస్తే అందులోని దైవత్వ ప్రభావాన్ని శక్తిని మహిమను ఒక అంశ దేవునిలోని ఒక అంశను బయటికి తీసుకొచ్చాడు. అది “ఓం” లేక “ఝంకారనాదం” ఏదో some నాదం. ఓంకారం అని దానిని మన సనాతన ధర్మంలో పెద్దలు చెప్పారు. నేనెప్పుడూ ప్రకటించేటప్పుడు “ఝంకారము” అంటూ ఉంటాను. సరే ఎందుకలాగా అంటే అది వేరే విషయము వేరే subject. మొత్తం మీద ఓంకారమా, జంకారమా?
మొత్తం మీద ఒక నాదం. అక్కడ అందరు ఏకీభవించాల్సిందే. నాదం బయటికొచ్చింది. ఆయనోక వ్యక్తి రూపం దాల్చాడు. కొడుకు అయినాడు మరి వీడికంత శక్తి లేదుగా ఒక generic son కావాలంటే వీడికి ఇంకొక female తో కలిసి ఒక కొడుకును కనే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి ఆ మహిమ ప్రపంచాల్లో లేదు. అక్కడ స్త్రీలు, పురుషులు ఉన్నారు గానీ వాళ్ళలో ఎవరితోను వీడు కలిసి ఒక అమ్మాయిని / కుమారున్ని కనే అవకాశం వాడికి లేదు. ఎందుకంటే వాళ్ళందరు దేవుని పరిపాలనలో ఉన్నారు. Actual గా ఆదాము, హవ్వల చేత పాపము చెయ్యించి మానవజాతిని దేవునికి దూరము చేసిన కారణమే అది. వీళ్ళు దేవుని పరిపాలనలో ఉంటే ఈ మానవ జాతిలోని స్త్రీ తనకు దొరకదు. మానవజాతిలో నాకు నచ్చిన ఒక స్త్రీ ఉండాలి. దాన్ని నేను పెళ్ళిచేసుకోవాలి. ఏదో అక్రమ సంబంధమో, సక్రమమో మొత్తం మీద అయితే సంపర్కం జరిపి నా విత్తనం ఆమెలో నాటి ఆమెలో నుంచి ఒక కొడుకుని కనాలి. వాన్ని భూమండలానికి రాజును చెయ్యాలి. పరలోకంలో దేవుడు ఊరికే నా కొడుకు, నా కుమారుడు అంటున్నాడుగా నేను నా కుమారుడని గొప్పలు చెప్పుకోవాలి. అయితే సరే. అందుకొరకు మానవ జాతిని దేవుడు సృష్టించాడు. ఈ “మైథున” సృష్టి. అంటే స్త్రీ పురుష సంయోగం వల్ల పిల్లలు పుట్టే పద్ధతి. ఇది కలిగిన ప్రపంచాన్ని దేవుడు చేసే దాక వాడు కొన్ని కొట్ల సంవత్సరాలు Wait చేసాడు. కోట్ల సంవత్సరాలు అయ్యాక ఇలాంటి ఒక జాతి ఉనికిలోకి వచ్చింది. వచ్చిన తరువాత ఇప్పుడు హవ్వ దగ్గరికి పోడానికి అవకాశం లేదు. అందుచేత ముందు దేవుని నుంచి cut-off చెయ్యాలి. So వాళ్ళను అవిధేయులుగా చేసాడు. దేవుని నుండి, తోట నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఆ తరువాత కూడా నాకు నచ్చినటువంటి స్త్రీ అని వాడు చూస్తూ చూస్తూ ఆకరికి కూషు భార్య మీద కన్నేసాడు. అయితే ఈ కూషు భార్యమీద కన్నేసిందేమో ఆదికాండము 10వ అధ్యాయము. దేవకుమారులు నరుల కుమార్తెలతో పాపం చేసిందేమో 6వ అధ్యాయము. కొన్ని వందల సంవత్సరాల
ముందు. ఎందుకు అంటే వీడు – నేను పోయి directగా ఒక మానవ కన్యకతో, మానవ స్త్రీతో సంపర్కం జరిపితే దేవుడు నన్ను భస్మం చేసెయ్యొచ్చు. అనంతుడు, అనంతమైన శక్తి సంపన్నుడు. ఆయన ఏమన్నా చేయగలడు. కలుగును గాక అంటే నేను పుట్టుకొచ్చాను. లేకపోవును గాక అంటే పోతాను గడా మరి! నా ప్రణాళికంత ఏం కావాలి! అంధకార రాజ్యాన్ని స్థాపించుకోవాలి. దానికి నా కొడుకును వారసుణ్ణి చేయాలి. దేవుని duplicate చేయాలి నేను. గనుక దేవునికి అసలు ఎంత కోపం వస్తది? ఏ level లో కోపం వస్తుంది? ఆ తప్పు నేను చేస్తే ఆయన ఎలా react అవుతాడో చూడడానికి వేరేవాళ్ళను Instigate చేసి, “వెళ్ళండ్రా వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళని అనుభవించండి వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోండి” అని దేవుని కుమారులను వాడు రెచ్చగొట్టి tempt చేసి పంపించాడు. మొదటిసారి వచ్చినప్పుడు దేవునికి కోపం వచ్చి జలప్రళయం పంపించి మొత్తం నాశనం చేసాడు. అప్పుడు పుట్టిన కుమారులను కూడా నాశనం చేసాడు. అప్పుడు దేవుడొక మాట అన్నాడు. తానూ సంతాపపడ్డాడు. ఈ నాశనాన్ని చూసి మరల నేనీలాగు చెయ్యను. మళ్ళీ ఒకసారి నరులు అక్రమము చేసినా కూడా జలప్రళయం రానివ్వనన్నాడు. అప్పుడు వీడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఓ అయితే ఈసారి మళ్ళా ఒక batch ని పంపిస్తే ఆయన మాట మీద ఉంటాడో లేదో చూద్దాం అని Second batch ని పంపించాడు మళ్ళీ నేఫీలులు పుట్టారు. ఈ నెఫీలులు జలప్రళయానికి ముందు ఉన్నారు, తరువాత ఉన్నారు అని ఆదికాండము 6వ అధ్యాయం చెబుతుంది. Next batch వచ్చి అట్ల పాపం చేసి నెఫీలులను కన్నారు. దేవుడు తన మాటకు కట్టుబడి ప్రళయం రప్పించకుండా ఉండిపోయాడు. ఓహో అయితే పెద్దమనిషి మాట మీద ఉంటాడన్నమాట. ఇప్పుడు నాకు కావాలనుకునట్టు ఒక కొడుకుని నేను కన్నా ప్రమాదం లేదు అనుకొని వాడు కూషు భార్యతో సంపర్కం చేసి కొడుకు నిమ్రోదును కన్నాడు. వాడు నెఫీలులనే అదుపు చేయగలిగిన మహా రాక్షసుడై, మహా బలశాలియై, బలాత్కారియై ప్రపంచయేక ప్రభుత్వం అంటే అప్పుడు ఉన్నదే కొన్ని లక్షల మంది జనాభా. వాళ్ళ మీద వాడు రాజు అయ్యాడు. వాడు బాబేలు గోపురం కట్టించాడు. అక్కడినుండి దేవుడు చెల్లాచెదురు చేసాడు అది చరిత్ర. దయచేసి మళ్ళీ చెబుతున్నాను సకల విషయములను ఆకళింపు చేసుకోడానికి క్రమబద్ధమైనటువంటి, Arrangement of historic incidents. చారిత్రిక సంఘటనలు ఏది ఎప్పుడు దేవుడు ఎందుకు చేసాడు? పరమార్థం ఏంటి? అందులో న్యాయం ఏంటి? అన్నీ తెలియాలంటే నా పుస్తకాలు చదవాలి మరి. ఏ పుస్తకాలు చదవము. బైబిల్ కూడా సరిగా చదవము, భక్తుల పుస్తకాలు చదవము, జ్ఞానము రావాలంటే అట్ల దొరకదు. దాచబడిన నిధిని వెదికినట్లు జ్ఞానము కొరకు వెదికితే
అది నీకు దొరుకుతుందని సామెతల గ్రంథం చెబుతుంది. నా పుస్తకాలు దయచేసి చదవండి.