24. ప్రశ్న : లూసీఫర్ విశ్వాంతరాల నిత్యచీకిని అహ్వానిస్తూ “ఓం” అని అంటూ ఎందుకు లేచాడు?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: వాడు అలా అంటూ లేవడం నేను దర్శనం చూసాను. ఎందుకు అన్నాడు అంటే ఓం ప్రథమంగా అని మనం అంటాం కదా! దైవారాధన కొరకు కల్పించిన మంత్రాలు గానీ లేక అభిచార మంత్రక్రియలు గానీ, పూజావిధములో గాని ఏదైనా సరే ప్రతీ మంత్రము ఓం తోనే ప్రారంభం అవుతుంది. మంచి చేసేవి, చెడు చేసేవి, దేవతలను ఆరాధించేవి. ఓం తోనే ప్రారంభం అవుతాయి గనుక, ఓం ప్రథమంగా అంటే అన్నిటికంటే ముందున్న శబ్దం ఓం అని మన దేశపు సనాతన గ్రంథాలు చెబుతున్నాయి. గనుక ఇప్పుడు విశ్వచరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవుతుంది. దానికి కూడా మొట్టమొదటి శబ్దంగా ఓం అని అతడు పలికాడు. అతడు ఓం అంటూ మొదలు పెట్టాడు తర్వాత అందరూ కూడా శుభకార్యమైనా, చెడు కార్యమైనా ఓం తోనే మొదలౌతుంది. ఓం అనేది అన్ని శబ్దములకు అన్నీ శక్తులకు మూలమైన మాతృక అయిన ప్రప్రథమ భీజాక్షరం గనుక అది పలికాడు.