(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసుప్రభువారు ప్రార్థన ఎలా చేయాలో చెప్పారు. యోహాను14:13లో చూడండి. నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అన్నారు. యోహాను 16:24 లో ఇది వరకు మీరు ఏమియు నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణం అవునట్లు నా నామమున అడగమన్నారు. యోహాను 14 అధ్యాయంలో రెండుసార్లు చెప్పిన యేసుప్రభువారు, యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరకి వెళ్లాలి, ఆయననామములోనే మనం ఏదైన అడగాలి. యేసుయ్యను ప్రక్కనపెడితే మనకు పరలోకంలో గాని, ప్రార్థన గదిలోనికి కాని ప్రవేశం ఉండదు. ఆయన నామములోనే ప్రార్థించాలి.