142. ప్రశ్న : ఈ రోజు జరిగిన “దిశ” హత్యకేసు Encounter పై మీ అభిప్రాయం తేలుపగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    చాలా మంచి పని జరిగింది. నేను వ్యక్తిగతంగాను, అలాగ నేను నా అనుచరులు కలిసి ఈ పనిని చేసిన వారిని అధికారులను, పోలీసులను అభినందిస్తున్నాను. అయితే క్రైస్తవ నాయకునిగా దీనిని మీరు ఏలా సమర్ధిస్తారు. అని మీరు అనుకోవచ్చు, నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మతముతో సంబంధించిన తీర్పులు అవసరం లేనటువంటి పరిస్థితి.  వారు చేసింది క్షమించరాని నేరం. హత్య అనేది ఆవేశంతో ప్రాణరక్షణ కొరకు, తప్పనిసరి పరిస్థితులలో లేకుంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగేటువంటి హత్యలకు ఏ కోర్టు అయిన కూడా కొంత కనికరం చూపుతుంది. కాని డా॥ప్రియంకా రెడ్డి హత్య ఏ విధంగా కూడా సానుభూతి చూపించడం కొరకు కాదు అది. ఎందుకంటే అది Pre-planned గా చేసిన Cold blooded murder.  మానభంగమేకాకుండ, కొన ఊపిరితో ఉండగా Petrol పోసి తగులబెట్టారంటే పాషాణ హృదయంతో ఉన్నవారు. పాపభీతి లేనటువంటి మనుష్యులు వాళ్లు. ఇంతదుర్మార్గులను క్షమిస్తే ఇంకా కొన్ని వందలమంది నేరస్తులను మనమే తయారు చేసినట్లు అవుతుంది. ఈ రోజుల్లో under-construction లో వున్న ఇలాంటి దుర్మార్గులు ఎందరో వున్నారు. వాళ్లు కూడా భయపడేటట్లుగా ఇలాంటి కార్యాలు జరగాలి. అందరు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి fully support  ఇవ్వాలి.