(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మంచి ప్రశ్న అడిగారు. ఒక విషయం ఏమిటంటే “పునరుత్థానము” అంటే అర్థం ఏంటంటే, పాప మరణముల నియమము, పాప మరణముల నియమము గలిగిన ఈ శరీరం నుండి ఈ పాప నియమం అనేది తొలగించబడి మరణించడానికి వీలు లేని అక్షయ దేహముగా లేవడమే పునరుత్థానము. అట్లాంటి దేహముతో యేసుప్రభు లేచాడు. ఆయన పునరుత్థానానికి, ఆయన ప్రథమ ఫలము. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఈ మధ్యలో వీళ్ళు లేచింది ఎట్లా? అంటే, లాజరు లేచినట్టు లేచారు. లాజరు, నాయీను విధవరాలి కుమారుడు, ఐతుకు వీళ్ళందరు చచ్చిపోయి లేసారు కదా. అయితే చచ్చిపోయి లేసారు గాని మళ్ళీ చచ్చిపోయారు. చనిపోయారు నిజమే, లేచారు నిజమే, గానీ లాజరు మహిమ శరీరంతో లేవలేదుగా! గనుక వాళ్ళు – లాజరు లేచి మళ్ళా ఎలా చచ్చిపోయాడో వాళ్ళందరు అలాగే, వాళ్ళు ప్రభువు సిలువ మీద మరణించినప్పుడు పరిశుద్దుల సమాధులు తెరువబడ్డాయి. ప్రభు లేచిన తరువాత ఊర్లో, పట్టణములో అనేక మందికి కనబడ్డారు. అంటే కనబడ్డారు అంటే వాళ్ళ పరిచయం ఉన్న మనుషులే లాజరు లాగా. ఇప్పుడు ప్రాచీన యుగాలలోనో లేకుంటే శతాబ్దాల కిందటనో చచ్చిపోయినవారు ఇప్పుడు లేచారు అనుకోండి. ఎవడు గుర్తుపడతాడు? కనిపించడం ఎందుకు? వీళ్ళు ఆ ఊర్లో బ్రతికి యేసును వెంబడించి చచ్చిపోయినోళ్ళు. వాళ్ళు మళ్ళా లేసి ఊర్లోకి వచ్చినారు. కొంత కాలం వాళ్ళ వాళ్ళతో ఉన్న తరువాత మళ్ళీ లాజరు పరిస్థితిలా అయిపోయింది అన్నమాట. So, అది పునరుత్థానమే కాదు. మోషే, మీరనట్టు ఏలియా, హానోకు మాత్రం పరలోకంలోను మిగతా భక్తులందరు కూడా ఇప్పుడు లాజరు కూడా మార్త మరియల తమ్ముడు లాజరు కూడ పరదైసులోనే ఉన్నాడు. ఐతుకు పరదైసులో ఉన్నాడు. నాయిని విధవరాలి కొడుకు పరదైసులో ఉన్నాడు. అలాగే వీళ్ళు కూడా పరదైసులో ఉన్నారు. అది పరిస్థితి.