(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బైబిల్ – అంటే తెలుగు బైబిల్ గోత్రము అని వుంటే English బైబిల్లో Tribes’ అంటే తెగలు అని ఉంది. అలా అని మనము తెగలు అని పిలవలేం. మానవజాతిలో ఒక జనాంగాన్ని విభజించినప్పుడు, వంశములవారిగా, కుటుంబముల వారిగా, గోత్రములు వారిగా అంటే మూలపురుషుల నామధేయంతో పిలవడం అలవాటు. అక్కడ విభజన అవసరం అయింది. ఇశ్రాయేలు వంశవృక్షంలో 12 మంది వంశంలో ఒక్కొక్కరు ఒక్కో బ్రాంచ్, అంతే తప్ప భారతదేశంలో ఉపయోగించే గోత్రాలతో సంబంధం లేదు. దేవుడు నరావతారానికి సిద్ధపరుచుకున్నదే ఇశ్రాయేలు జనాంగం.