(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: స్పష్టమైనటువంటి పౌలు బోధన చెప్పాలంటే, వాక్యం కూడా చూపిస్తాను. ఖచ్చితమైన పౌలు భోధ, అపోస్తలుల భోధ చెప్పాలంటే ఇప్పుడు ఒక మిఠాయి షాపులో ఒక మిఠాయి కొన్నాను. Directగా ఇంటికి తీసుకుపోయి తింటే తినేస్తాము, లడ్డులు తినేస్తాం. ఈ లడ్డును తీసుకెళ్ళి ఒక దేవత విగ్రహం ముందు పెట్టారు అనుకోండి. పెట్టి మళ్ళా తీస్తే ఇంత లోపల ఆ లడ్డు లోపలికి దేవుడు రాడు, దయ్యము రాదు, ఏ శక్తి రాదు. అది అక్కడా లడ్డు, ఇక్కడా లడ్డు ఏ. అది క్రైస్తవుడి విశ్వాసం. అయితే ఒక హిందూ విశ్వాసం ఏంటంటే దేవత ఆశీర్వాదం అందులో ప్రవేశిస్తుంది. దేవతకు నేను నైవేధ్యం పెట్టినప్పుడు నేను నా దేవత మీద నా ప్రేమను వ్యక్తం చేసాను గనుక ఆయన సంతోషించి, నన్ను ఇంత ప్రేమించావురా భక్తుడా! నీవు నాకు పెట్టింది నేను తింటానేంటి దేవుణ్ణి కాబట్టి నాకు ఆకలిదప్పులు ఉండవు. నాకు పెట్టింది నేను ఆశీర్వదిస్తాను. దేవుని ముందు పెట్టి, దేవుని దయగల చల్లని చూపు దానిమీద పడింది అనుకున్నాక దాన్ని తీసుకొచ్చి దేవుడు ఆశీర్వదించింది తింటే మనకందరికి ఆశీర్వాదము అని ఒక Sentimental faith అనేది Hinduism లో ఉన్నది. అయితే క్రైస్తవుడు ఇది నమ్మడు. ఎందుకు నమ్మడు అంటే మరి పౌలు భక్తుడు చెబుతున్నమాట మనం చూద్దాం. దయచేసి 1కొరింథి 8:4 “కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరే దేవుడు లేడనియు ఎరుగుదుము. మొన్న ఈ మధ్య యాదగిరి గుట్ట పూజారి గారు కూడా చెప్పారు ఈ మాట. ఇప్పుడు మనం చెప్తేనేమో దూషించాం అంటారు. మరి హిందూ ధర్మప్రచారకులు, తరువాత ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అక్కడ అది ఒక రాయి మాత్రమే దేవుడు కాదని ఆయన చెప్పింది. చాల జ్ఞానయుక్తమైన మాట అసలు హిందువులందరు నమ్మేది కూడా అదే. ఉదాహరణకు నేను చాలా సార్లు clarity ఇచ్చాను. ఇప్పుడు భగవంతుని రూపం అని ఒక రూపం పెట్టుకొని, concentration కొరకు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుని రూపం ఇది అంటే ఇప్పుడు ఈ గుడిలో ఉన్న ఈ విగ్రహామే సూర్యచంద్రులను, నక్షత్రాలను, ఖగోలమండలాలు, బ్రహ్మాండాన్ని ఈ రాయే చేసిందని ఎవరు అనుకోరు కదా! హిందువులు కూడా అలాగ అనుకోరు. వాళ్ళు విగ్రహం ఎందుకు పెట్టుకుంటారంటే, ఈ సకల బ్రహ్మాండపు కోటిని చేసిన మహా అనంత శక్తి ఒకటి ఉన్నది. ఆయన ఎలా ఉంటాడో తెలీదు. ఆయన రూపం ఎలా ఉంటదో. ఎలా address చేయాలో, ఎలా సంబోధించాలో తెలీదు. ఆయన మీదికి ఆ శక్తి మీదికి తలంపులు వెళ్ళాలంటే కళ్ళు మూసుకోగానే భార్య గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తాడు, పిల్లలు గుర్తొస్తారు, అప్పులు గుర్తొస్తాయి, office లో officer పెట్టిన చీవాట్లు గుర్తొస్తాయి. Concentration ఉండదు. గనుక ఆ అనంత శక్తి మీదికి మనం Mind మళ్ళించాలంటే మిగితావన్నీ చూడటం మానేసి ఒకదాన్ని చూస్తునట్టు దృష్టి ఒకదాని మీదికి వస్తే తలంపులు చెల్లాచెదురు కాకుండా ఉంటాయి. Concentration సాధించేదాకా విగ్రహం అవసరం. Concentration వచ్చేసాక విగ్రహం అక్కరలేదని మహర్షులు హిమాలయాలకు వెళ్ళిపోయి కళ్ళుమూసుకొని అంతరాత్మలోనే వాళ్ళు పరమాత్ముని సాక్షాత్కారం పొందుతారు. So concentration సాధించేదాకా helpful గా ఉంటుంది, అనే పాయింటే తప్ప ఈ రాయే సూర్యున్ని చేసింది అని ఎవరు నమ్మరు. గనుక హిందువుల యొక్క విగ్రహ భక్తిని కూడా క్రైస్తవులు అర్ధం చేసుకోవాలి. No Hindu believes that the stone has created the Sun and Moon and Stars. Sun, Moon and stars చేసిన శక్తికి మీదికి Mind వెళ్ళడానికి (Concentration) ఇది నాకు సహాయం చేస్తుంది. అయితే విగ్రహము ద్వారా ఏకాగ్రత సాధించిన తరువాత హిమాలయాలకు వెళ్ళిపోయి మహర్షులు ఎలాగ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారో, దానినే కళ్ళు మూసుకొని క్రైస్తవులు అటువంటి ధ్యానమునే, యేసురక్తం ద్వారా దేవునితో సమాధాన పడి, కళ్ళముందు ఏ ఆకారం లేక పోయినా ఏకాగ్రత కలిగి తమ గదిలోనే ప్రార్థన చేసుకుంటారు. ఇదీ విషయం అందుచేత అక్కడ లడ్డూ పెడితే ఆ విగ్రహంలో Power లేదంటున్నారు. కదా అక్కడ లడ్డూ పెట్టినా పెట్టకపోయినా అక్కడ పెట్టిన లడ్డూ ఎంతో అక్కడ పెట్టని లడ్డూ అంతే. Anyway ఆ విగ్రహం ముందు పెట్టిన దానిని పొరపాటున మనం తిన్నా కూడా మనలోపలికి ఆ దేవత శక్తి వచ్చి హాని చేస్తుందని భాద పడాల్సిన అవసరం లేదు. కానీ తినొద్దు అన్నాడు పౌలు ఎందుకంటే సాక్ష్యము కొరకు. మేము నమ్మిన దేవుడు ఆత్మ స్వరూపుడు, సర్వాతంర్యామి, యజ్ఞపురుషుడు. ఆయన చనిపోయి తిరిగిలేచిన పునరుత్థాన మహిమ శరీరుడు. ఆయన అంతటా ఉన్నవాడు. గనుక, ఒక విగ్రహాన్ని ఆయన ఇష్టపడడం లేదు. గనుక ఈ విశ్వాసం మేము ఒప్పుకోము అనే సాక్ష్యం కొరకు తినొద్దు అన్నాడు. మనం కూడా వాళ్ళలాగా అన్నీ తినేస్తే, యేసు రక్షకుని గూర్చి ఎప్పుడు చెప్తాము? చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకోసం తినొద్దు అన్నాడు తప్ప అనుకోకుండా తినేస్తే మనలోనికి దేవుడూ రాడు దయ్యము రాదు. లడ్డూ పోతుంది లోపలికి అంతే.