162. ప్రశ్న : 1రాజులు 16:6-8లో బయెషా చనిపోయాడు బయెషా కుమారుడు ఇశ్రాయేలును ఏలనారంభించెను అని వుంది. అదేవిధంగా  2 దినవృత్తాంతం 16:01 లో యూదా రాజైన ఆసా యేలుబడినందు బయెషా బ్రతికేవున్నాడు. ఇది ప్రింటింగ్ మిస్టేకా ఇందులో Key point Answer ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    ఆసా యేలుబడిలో 26సం॥లో బయెషా కుమారుడు ఏలా  ఏలనారంభించెను అని ఉంది. ఇశ్రాయేలీయులు, యూదా ఏలుబడి వ్రాయించెను 1రాజులులో.  2దినవృత్తాంతములు మాత్రం యూదా ఏలుబడి గూర్చి వ్రాయబడింది. బయెషా చనిపోకముందు ఆసా 25 years ఆసా ఏలుతున్నాడు. బయెషా, ఆసా, Contemporaries ఏ.  బయెషా  ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆసా యూదా రాజ్యాన్ని ఏలుతున్నాడు. 26 సంవత్సరాలు ఆసా ఏలినాక బయెషా చనిపోయి బయెషా కుమారుడు ఏలుతున్నాడు.  2 దినవృత్తాంతం 16:01 లో ఆసా 36 సంవత్సరాల ఏలుబడిలో బయెషా అని ఉంది కాని ఇక్కడ బయెషా కుమారుడు అని వ్రాసివుండాలి.  Copiest mistake జరిగింది.