(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మీరు కర్నూలులో ఉంటారు కదా? బస్సులో కర్నూలు నుంచి హైదరాబాద్ రావాలనుకోండి. వచ్చినప్పుడు హైదరాబాద్కు రాగానే హైదరాబాద్ వచ్చింది అంటాం కదా. హైదరాబాద్ మన దగ్గరకి రాదు. మనమే హైదరాబాద్కు వస్తాం. మన అనుభూతి అంతే. అలాగే సూర్యోదయం, సూర్యస్తమయం అనేది ఏమిటంటే భూమి తన పొజిషన్ మార్చుకుంటూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు కనిపించిన స్థితి మనకు వస్తే అది సూర్యస్తమయం. సూర్యుడు కనిపించే స్థితికి వస్తే అది సూర్యోదయం. సూర్యుడు ఉన్న చోటే ఉంటాడు, భూమే తిరుగుతుంది. సూర్యుడు ఉదయించేది, అస్తమించేది ఉండదు. అది మన అనుభూతి మాత్రమే అలాగా సూర్యుడు కనిపించకుండా ఉండే గ్రహస్థితిని దేవుడు ఆనాడు యెహోషువాకు కల్పించాడు అంతే.