168. ప్రశ్న : ఈ మధ్య బాలీవుడ్ నటులు ఫరాఖాన్, రవీనాటండన్, భంతిసింగ్ ఒక గేమ్ షోలో స్పెల్లింగ్ తప్పుగా హల్లెలూయా వ్రాసి కామెడీ గా మాట్లాడారు. దీని విషయములో మీ స్పందన ఏమిటీ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు గల వాళ్ళంతా కళాకారులు వాళ్ళకి హల్లెలూయా అన్న పదములోని పరిశుద్ధత గాని ఆ మాటకు అర్థము కాని వాళ్ళకు తెలియదు.  అది ఒక ప్రోగ్రామ్లో వాళ్ళు హల్లెలూయా స్పెలింగ్ రాయమని అలా చెప్పారు.  ఒకమ్మాయి కరెక్టు రాసింది 10 మార్కులు వచ్చాయి.  అది ఒకమ్మాయి రాయలేదు.  దానికి అర్థం తెలుసా అని అడిగితే ఇది దుర్గందమైనటువంటి ఒక తిట్టు అని చెప్పింది.  ఆమె అజ్ఞానానికి నవ్వారు.  అంతేగాని వాళ్ళు బైబుల్ని గాని, క్రైస్తవులను గాని, దూషించడం లేదు.  అది ఒక గేమ్ మాత్రమే దానికి అంతగా ఉలిక్కి పడేది ఏమి లేదు.  హిందూ ధర్మం ఎంత గొప్పదంటే వాళ్ళు, వాళ్ళ దేవతపైనే బొమ్మలు గీసుకుంటూ ఫన్ని క్యారెక్టర్స్ చేస్తారు.  పూరాణాల్లో వినాయక చవితినాడు చంద్రున్ని చూడోద్దు అంటారు.  ఎందుకంటే వినాయకుడు బొజ్జ నిండా తింటాడు.  తిన్నందుకు పొట్ట ఉబ్బింది.  అది చూసి చంద్రుడు నవ్వాడంట.  కాబట్టి వినాయకుడికి కోపం వచ్చి శపించాడంట.  వినాయక చవితి రోజు నిన్ను చూసిన వాళ్ళు అపనిందల పాలగుదురని శాపం. అందుకని చూడోదంటే చూడరు.  వాళ్ళు దేవుడు అన్నవాన్ని కూడ విలాపవస్తువుగా వాడుకుంటారు.  మనము మాత్రం యోహోవా దేవుని మీద కార్టున్లు గీయలేము.  జీసస్ మీద కార్టున్లు గీయలేము.  యోహోవా దేవుని పేర్లు ఎవ్వరికి పెట్టుకోము. మనము దేవుని నామమును గూర్చి ఉచ్ఛరించడానికి కూడా భయపడే పెంపకం మనది.  వాళ్ళకు ఆ భయం లేదు.  అంతే గాని అది అంత పెద్ద మత దూషణ ఏమి కాదు.  దీనిని పెద్ద ఇష్యు చేయొద్దు అని నా మనవి.