(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ప్రవచనములను నమ్మని వాళ్ళకు జవాబే మీరు చెప్పిన వచనం. దాన్ని నమ్మని వాళ్ళకు ఇంక ఏ వచనం లేదు. బైబిలే లేదిక. నమ్మని వాళ్ళకు శిక్ష విధింపబడును. అంతకంటే మనము ఏం చెప్పలేం. మీరు చెప్పిందేంటంటే ప్రకటన గ్రంథము 10:11 వచనం “అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులను గూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి”. గనుక ప్రవక్తలు లేరు, ప్రవచించుట లేదు అనే వాదనే ఒక Stupid Argument అని నేనంటున్నాను. ఎందుకంటే వాళ్ళను దువ్వీ దువ్వీ వాళ్ళను ఏదో మెళ్ళిగా కాకాపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు బుజ్జగించి చెప్పి చుసాము. ప్రవక్తలు లేరు అన్న ప్రతివార్నిని కూడా ఒక బుద్ధిహీనుడుగా ఎంచుకోవాలి. ప్రక్కకు నెట్టేసేయాలి. వాడ్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుడు కొంతమందిని అపొస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను. దేవుడు నియమించెను అని ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు దేవుడు వీళ్ళను ఇచ్చాడు అనే సంగతి ఎఫెస్సి పత్రిక 4:13వ వచనంలో చెప్పబడింది. ప్రవక్తలను అపోస్తలులను ఎందుకిచ్చాడు? అంటే పరిశుద్దులు సంపూర్ణులు కావడం కొరకు ఇచ్చాడు. మరి ఇప్పుడు సంపూర్ణులు అయ్యారా? అంటే కాలేదు. సంపూర్ణులు కాలేదు గనుక ప్రవక్తలు, అపోస్తలులు ఇంకా పనిచేస్తునే ఉంటారు సంపూర్ణులు అయ్యేదాకా పని చేస్తారు, గనుక అది నమ్మని వారిని వదిలేసెయ్యండి. అవిశ్వాసులు, భ్రష్టులు ఎప్పుడూ ఉంటారు. మీరు నమ్ముతున్నారు గనుక నాకు సంతోషం. GOD BLESS YOU.