173. ప్రశ్న : మత్తయి 4:8 వచనంలో మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటిని ఆయనకు చూపి అన్నాడు అయ్యగారు.  కొండమీదకి ఎక్కితే ఈ లోకరాజ్యములన్ని కనబడుతాయా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    ఇప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి అపవాది ఎవరు అంటే, ఈ లోకంలో ఉన్న సైన్టిస్ట్లందరిని కలిపినా వాళ్ళకన్నా తెలివిగల వాడు అపవాది. వాడు పడిపోయిన దేవదూత.  ప్రధాన కెరూబులలో ఒకడు.  ప్రధానులకే ప్రధాని.  దానియేలు కంటే జ్ఞానవంతుడు.  సంపూర్ణ సౌందర్యవంతుడు, మహాజ్ఞాని. వాడికేది మరుగు లేదు.  అటువంటి మహాశక్తిశాలి.  వాడి శక్తితోనే ఐగుప్తు దర్బారులో ఐగుప్తు మాంత్రికుడు కర్రలు క్రింద పడవేసినప్పుడు పాములుగా మారిపోయినవి.  అంటే కర్రలను పాములు చేయగలిగినంత శక్తి మంతుడు వాడు.  అంత శక్తి గలవాడు వాడు మనిషి కాదు కదా.  వాడి దగ్గర ఎన్నో అతీత శక్తులున్నాయి.  అందులో ఒకటి సుదూరాన ఉన్న దాన్ని కూడా దగ్గరకు చూపించే శక్తి వాడికున్నది.  దేవుడు ఇచ్చే దర్శనాలు ఉన్నాయి.  సాతాను ఇచ్చే దర్శనాలు ఉన్నాయి కదా! మనము ఇండియాలో కూర్చోని ప్రార్ధన చేస్తుంటే, అమెరికాలో జరిగినవి దర్శనాలు చూచిన వాళ్ళు ఉన్నారు కదా! అలాంటి దర్శనం వాడు ఆయనకు చూపించాడు.  అది జవాబు.