(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ కరుణశ్రీ అడిగినటు వంటి ప్రశ్న చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. ఆమె ఒక్కతే ఆ కుటుంబంలో రక్షణ పొందింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరు కూడా హిందుమత భక్తి కలిగిన వారు. పూజలు ఎక్కువ చేస్తారు. ఆ పూజలకు సంబందించిన కుంకుమగాని పసుపుగాని నైవేధ్యం వస్తువులు గాని కొబ్బరిగాని నా వస్తువులకో నా బట్టలకో నేను తినే భోజనానికో తగిలితే నాకేమైన నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? అనే భయం ఆ బిడ్డ వ్యక్తం చేసింది.
ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెపుతున్నాను. పౌలు 1కొరింథీయులకు 8:4వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. తాకడం కాదు కడుపులోకి పోతే కూడ ఏమౌతుందో చెపుతున్నాడు. విగ్రహములకు అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము 7వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు. గనుక ఒకప్పుడు ఇది ఒక దేవత దీనికి గొప్ప శక్తి ఉన్నది అన్న మైండ్లో నుండి వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. రక్షణ పొందిన తర్వాత కూడా అందులో ఏదో ఉంది పవర్ అనే మైండ్సెట్ నుంచి వీళ్ళు ఇంకా బయటకు రాలేక పోతున్నారు. అందుకే 7వచనంలో చెపుతున్న ప్రకారముగా అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకే విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని తాము ఎంచి భుజించుదురు. అందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్ర మగుచున్నది. భోజనమును బట్టి మనము దేవుని యెదుట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు. తిన్నందున మనకు ఎక్కువ లేదు. అసలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, తినక పోవుట అనే విషయంలో ఎఫెక్టే ఉండదు అంటున్నాడు. దాని వలన మేలు లేదు కీడు లేదు అంటున్నాడు. ఒక దేవతకే నైవేద్యం పెట్టాలంటే తలారా స్నానం చేసి పవిత్రంగా లడ్డులు, కుడుములు, ఉండ్రాల్లు ఏదైనా సరే తయారు చేస్తారు. మరి అటువంటి ఉద్దేశ్యంతో నైవేద్యం పెడతారు. అయితే పౌలు భక్తుడు చెప్పెదేమిటంటే అక్కడ పెట్టడం ద్వారా దానిలోకి ఆ లడ్డు లోకి ఏవ్యక్తులు రారు. ఏశక్తి రాదు. మనకు ఏది పెడితే అది ఏ విచారణ చేయక తినవచ్చును. యేసు రక్తములో కడగబడిన విశ్వాసి ఒక విగ్రహం దగ్గర పెట్టింది తినగానే ఏమిజరుగదు. మన మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మినది విగ్రహర్పితమైనను ఏ విచారణ చేయకుండా తినవచ్చు అంటాడు. 1కొరింథీ 10:25 వచనంలో అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచిన యెడల మీకు వడ్డించినదేదో ఏ విచారణ చేయకుండా తినుడి. వాళ్ళు ఏది పెడితే అది తినాలి. 27వచనంలో ఏవిచారణ చేయక కటిక వాని అంగట్లో అమ్మినవేవో తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి. గనుక జీవగ్రంథంలో పేర్లు రాయబడిన ఒక గొప్ప విశ్వాసికి ఒక విగ్రహం దగ్గర పెట్టింది ముట్టుకుంటే తినగానే పెద్ద కీడు సంభవించినట్టు భయపడితే యేసు రక్తములో ఉన్న శక్తి ఏమున్నది? అంత బలహీనమా యేసురక్తము? ఇవన్నీ ఒట్టి భయాలు ఏమీ జరుగదు. బైబిల్ లో తేటగా చెప్పాడు. విగ్రహములో ఏమీ లేదు? విగ్రహర్పితములో ఏమి లేదు? వీళ్ళు విగ్రహముల కర్పించిందని ఎంచి తినుచున్నారు. విశ్వాసులలో కూడా కొంత మంది భయపడుతున్నారు. ఎవరైనా బంధువులలో చనిపోతే వెళ్ళరు. దుఃఖంలో ఉంటే వెళ్ళరు. భాధతో ఉన్నవారిని ఆదరించరు. మరి సువార్త చెపితే ఎవరు వింటారు? ఇప్పుడు బందువు ఇంట్లో మనిషి చచ్చిపోయి ఏడుస్తుంటే మనము వెళ్ళలేదు, ఆదరించలేదు. తర్వాత పోయి దేవుడు ప్రేమగలవాడు అని చెపితే షటప్ అండ్ గెట్అవుట్ అంటారు. కాబట్టి మనము ఏమిటంటే లోకములో నుంచి వేరు చేయబడాలి. అంటే రక్షణ పొందని వాళ్ళనుంచి మొత్తము వేరు చేయబడాలి అని కాదు. 1కొరింథి 5:9,10వచనములో జారులతో, సాంగత్యము చేయవద్దని నాపత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో అయినను, లోభులతో అయినను, దోచుకొను వారితో అయినను, విగ్రహరాధకులతో అయినను, ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసివచ్చును గదా అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను. ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. నేను ఇంట్లో ఉన్నాను నాకు ఎఫెక్టు వస్తదా అంటున్నారు? దసరా నాడు ఆయుధపూజ అని బస్సుకే పూజ చేస్తున్నారు. ఆ బస్సే ఒక విగ్రహం. రైలు ఇంజన్కు పూజ చేస్తారు. అదీ ఒక విగ్రహమే. ప్రతి బస్సులో ఏదో ఒక విగ్రహం ఉంటుంది. మరి ఒక విగ్రహం లోపలే మనము కూర్చోని ప్రయాణం చేస్తాము. మరి ఇంట్లో విగ్రహం ఉంది. నాకు ఎఫెక్టు వస్తదా? అని అంటే మన దేశమే విగ్రహల మయము మనము ఒక హోటల్కు పోయి ఏదో టిఫిన్ తెచ్చుకొని తింటున్నాము. మరి ఆ హోటల్ వంట చేసే టప్పుడు దేవతక పూజ చేసి నైవేద్యం పెట్టి చేస్తారు మరి. ఆలెక్కన హోటల్లోది ఏది మనము తినకూడదు. గనుక ఏ క్రైస్తవులైన ఆ విగ్రహము ముందు పెట్టిన దానికి శక్తి వచ్చిందన్న మూఢనమ్మకం నుండి బయటకు రావాలి.