175. ప్రశ్న : 1కొరింథి 6:9వచనంలో ఆడంగితనము కలవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఉంది.  ఆడంగి తనము కలవారు అంటే హిజ్రాలు ఉన్నారు కదా వాళ్ళా? ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? హిజ్రాలైతే గనుక వారు దేవుని సేవ చేయవచ్చ ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    మనకు ఎప్పుడైన బైబిల్ లో ఏదైనా వచనం అర్థం కానప్పుడు క్రింది వచనం చదివితే అర్థం అవుతుంది. 1కొరింథి 9వచనంలో ఆడంగితనము కలవారు దేవుని రాజ్యవారసులు కానేరరు అని.  మళ్ళీ 11వచనంలో మీలో కొందరు అట్టి వారై ఉంటిరి.  అంటే జారులు, విగ్రహరాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు అయి ఉంటిరి.  గాని అంటే రక్షణ పొందక ముందు, నూతన జన్మ పొందక ముందు, మీలో కొందరు అటువంటి వారై ఉంటిరి.  గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమందున మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి, పరిశుద్ధ పరచబడినవారై నీతి మంతులుగా తిర్చబడితిరి.  అంటే ఈ దొంగలు, మోసగాళ్ళు, విగ్రహారాధికులు, లోభులు, దోచుకొనువారు వీరందరితో పాటు ఈ ఆడంగితనము గలవారు అనేది కూడ అభ్యంతరకరమైన జీవితం.  అయిన కూడ ఒకప్పుటి దొంగలు ఇప్పుడు నీతిమంతులుగా మారి సేవచేస్తున్నారు. ఒకప్పటి తాగుబోతులు ఇప్పుడు సేవ చేస్తున్నారు.  ఒకప్పటి హంతకులు, వ్యభిచారులు ఇప్పుడు సేవ చేస్తున్నారు. అంటే రక్షణ పొందక ముందు ఉన్న అయోగ్యతలన్ని బాప్తిస్మ సమయంలో సమాధి చేయబడతాయి.  పాతవి గతించెను సమస్తము కొత్తవాయెను అన్నట్లు వాడి దొంగబ్రతుకు, మోసపు బ్రతుకు, వ్యభిచారబ్రతుకు, అంతా సమాధి అయి పోతుంది.  అన్యదేవత ఆరాధన చేసిన చరిత్ర సమాధి అయిపోతుంది. అలాగే ఇతని శరీరమందున ఆడంగితనము అనే లోపము కూడా అక్కడ సమాధి అయిపోతుంది. అతను ఇప్పుడు కొత్త వ్యక్తి మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందితే అతని కున్న అవలక్షణాలు సమాధి అయినట్టే ఇది కూడా సమాధి అవుతుంది.  కనుక అలాంటి వ్యక్తులు సాక్ష్యులుగా జీవించవచ్చు.  కాని సంఘకాపరులు కారు సువార్తికులే.  ఎందుకంటే ఆడంగితనం అంటే అసలు వారు పురుషులు కారు.  సంఘకాపరి అంటే యేసుకు సూచన.  యేసుప్రభువు పురుషుడు కనుక కాపరిగా సేవ చేయకూడదు.