178. ప్రశ్న : ఆదికాండంలో మనిషికి జీవాత్మ, జంతువులకు ఆత్మ only ప్రాణం ఉంది. చనిపోయిన తరువాత నరుని ఆత్మ దేవుని దగ్గరకి వెళ్ళుతుంది.  మరి జీవుల ఆత్మ ఎక్కడికి వెలుతుంది?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    జీవుల ఆత్మ లేదు బాబు, జీవికి ఆత్మ ఉండదు. జీవికి ప్రాణము మాత్రమే ఉంటుంది విన్నారా! మనిషికి ఆత్మ ఉన్నది.  గనుక మరణం తరువాత ఉనికి ఉంటుంది. మరి జంతువులకు ఆత్మలేదు.  వాటికి ప్రాణము మాత్రమే వుంది.  గనుక మరణాంతరం వాటికి ఉనికే ఉండదు. ప్రసంగి 3:21వచనం నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో మృగముల ప్రాణం భూమికి దిగిపోవునే లేదో ఎవరికి తెలియును అని అన్నాడు.  నరుని ఆత్మ అన్నాడు మృగము యొక్క ప్రాణము అన్నాడు.  మృగము యొక్క ఆత్మ అనేది లేదు. Will be edited.