(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: Direct గా నేను విగ్రహమును గౌరవించి విగ్రహమును పూజించి ఈ భక్తిని లేక ఈ మోక్షసాధన మార్గాన్ని నేను అంగీకరించి భక్తితో ఇస్తున్నాను అని సమర్పించింది మాత్రమే దేవతకు ముడుపు అవుతుంది. గాని నాకు దాని మీద నమ్మకం లేదు అని చెప్పి ఇచ్చినప్పుడు దేవతకు ఇచ్చినట్టు అవ్వదు. For Example నేను చెప్తున్నాను కొబ్బరి తోట పెంచుకున్నాము, కొబ్బరి తోట పంట అమ్మాము. ఆ కొబ్బరి కాయలను ఒకడు తీసుకెళ్ళి ఇంట్లో పచ్చడి చేసుకున్నాడు. Hotel లో పచ్చడి చేసారు. ఇంకోకడు తీసుకెళ్ళి గుడిలో కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు ఈ కొబ్బరితోట యజమాని విగ్రహారాధనను Support చేసినట్టా ? Hotel Business support? దేన్ని support చేయలేదు. తీసుకెళ్ళినవాడు ఏం చేసుకుంటాడో ఈయనకు సంబంధం లేదు. నేను పంట పండించాను. మీకు ఇచ్చాను. వృత్తి ధర్మంగా దాన్ని ఏం చేసుకుంటావో, దాని పాపపుణ్యాలు నాకు అంటవు. అదీ పరిస్థితి. అట్లాగే ఇప్పుడు వినాయక చవితి చందాలకు వస్తారు. మేము ఉండే కాలనీలో. నేను చెప్పేది ఏంటంటే? “బాబు విగ్రహరాధన బైబిల్ ప్రకారం దేవుడు వద్దన్నాడు. కాబట్టి నేను దీనికి ఇవ్వలేను ఒక 10, 100 ఇప్పుడు ఇస్తే నువ్వు సంతోషపడతావు. ఇలా కాకుండా ఒక football ground ఏర్పాటు చేయి. బీదలకు అన్నదానం చేయి. లేకపోతే ఇంకేమన్నా Medical Camp ఏర్పాటు చేయి. ఇంకేదన్నా పిల్లలకు క్రీడా రంగంలో చేయి, ఒక Study Circle, గ్రంథాలయం ఏర్పాటు చేయండి. వేరే కాలనీ వాసులందరు ఒక్కొక్కరు పది రూపాయలు ఇస్తే నేను పది వేలు ఇస్తా. ఆ మంచి కార్యాక్రమానికి నేను బ్రతికి ఉన్నంత కాలం నేనే మహారాజ పోషకుడిగా ఉంటా. నేను అన్నం అయినా మానేని నేను సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమానికి డబ్బులు ఇస్తా. అయితే మరి నాకు నమ్మకం లేదు అని తెలిసినదాని మీదికి డబ్బులు పెట్టాలి అని నన్నెందుకు బలవంతం చేస్తున్నారు? ఇది సరైన వైఖరీ కాదు కదా! అట్లాకాకుండా వారు బలవంత పెట్టాడు ఇవ్వకపోతే కొడతాం, చంపుతాం అన్నారనుకోండి. Very Simple తీసుకొండయ్యా 50 రూపాయలు. వీటి పాప పుణ్యాలు నాకు అంటవు. నేనిప్పుడే చెప్తున్నా యేసే రక్షకుడు, ఇంకేవి రక్షకుడు కాదు. మీరు నమ్మి మారుమనస్సు బాప్తిస్మం పొందండి. ఈ పూజ మీద నమ్మకంతో ఇవ్వడం లేదు, మీరు బలవంతం చేస్తున్నారు గనుక, మీరు మూర్ఖంగా నన్ను బెదరిస్తున్నారు గనుక, ఆ దేవునికే మిమ్మల్ని అప్పజెప్పి ఇస్తున్నాను”. అని సాక్ష్యం చెప్పి ఇచ్చాననుకోండి, దేవుడు నన్నేం నరకంలో పడేయడు. అసలు విగ్రహానికి కానుక ఇవ్వొచ్చా? అని ఇంత పెద్ద ప్రశ్న అడుగుతున్నారు క్రైస్తవులు? దేవుడుండి “విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి”. అని కొలస్సీ 3వ అధ్యాయములో అంటున్నాడు. క్రైస్తవుల హృదయాలలోని విగ్రహాలు ఏంటి? కొంతమందికి భార్య విగ్రహం, భర్తే విగ్రహం, కొడుకే విగ్రహం, డబ్బే విగ్రహం, వాళ్ళ అందచందాలే విగ్రహం, వాళ్ళ పదవి విగ్రహము. హృదయాల్లోని విగ్రహం తొలగించుకోకుండా ఈ విగ్రహాన్ని గూర్చి మాట్లాడతాడు. గనుక దాని మీద పెట్టినంత దృష్టి మనము వినాయకుడికి చందాలు ఇస్తున్నామా? ఇవ్వట్లేదా? అది స్నేహా ధర్మంగానా? లేకపోతే ఏదో ఒక సాక్ష్యార్థమా? లేకపోతే బలహీనులమా? దానిమీద దృష్టి పెట్టేకంటే ప్రతీ క్రైస్తవుడు తన హృదయంలో ఉన్నటువంటి అహంభావము, ధనాపేక్ష, ఇలాంటి విగ్రహాలను తొలగించుకోవడం మీద దృష్టి పెడితే ఇంకా తొందరగా వీళ్ళు దేవుని రాజ్యానికి యోగ్యులు కాగలుగుతారు. అదీ పరిస్థితి.
మనము ఏం కోరుకుంటాము అందరు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు Happy Diwali అని నేనంటా, నా ఉద్దేశ్యం ఏంటంటే Diwali మీరు నిప్పులతో ఆడుకుంటున్నారు. Deepavali సందర్భంగా ఎంతమంది ఒళ్ళు కాల్చుకోవడం, ఇల్లు కాల్చుకోవడం, వందల, వేల మంది చచ్చిపోవడం. నేను Happy Deepavali అని ఎందుకు చెప్తానంటే బాబు మీరు వద్దని చెప్పినా నిప్పుతో ఆడుకుంటున్నారు. మీకు మీ పిల్లలకు Deepavali సందర్భంగా ఎలాంటి అపాయం కలుగొద్దు నేను నమ్మిన యేసు దేవుడు మిమ్మును కాపాడాలి. అని చెప్పి Happy Deepavali అంటా. ఎవరికైనా Deepavali సందర్భంగా వాళ్ళ చిన్నపిల్లల బట్టలు తగలబడి, వాళ్ళే తగలబడి చచ్చిపోయి బూడిదైపోయాడు అనుకోండి. వాడు next నుండి Deepavali చేసుకుంటాడా? దీపావళి పండుగ నాడు వాని కూతురు యొక్క మరణదినం వచ్చే సంవత్సరం కూతురి దినం పెడతాడా? పండుగ చేసుకుంటాడా? నరకాసురుడు చచ్చిపోయాడు అని సంతోషిస్తాడా? నా కూతురే చనిపోయింది అని ఏడుస్తాడా? next Deepavali కి మీరు పండగ చేసుకుంటున్నారు. మీకు ప్రమాదం కలుగకుండా ఉంటే next మళ్ళీ Deepavali అవ్వుద్ధి లేకపోతే, మీకది సంతాప దినం అయిపోతుంది. గనుక వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు ఏం ఉంది. Happy Ramzan అంటున్నం Happy Deepavali, Happy Ugadi, అందరు సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా! అన్ని చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టేకంటే అంతరంగ శుద్ధి మీద దృష్టి పెట్టేది మంచిది.