(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అదేగదా ఇక్కడ ఈదేశంలో ఉండాలంటే హిందువుగా ప్రకటించుకో అక్కడ application లోపల ఆ Clause ఉన్నది. ఇప్పుడు ఈదేశంలో చాలా కాలంగా అక్రమంగా ఉంటున్నావ్. You are Muslim. అప్పుడు నీకు అవకాశంలేదు. ఈ దేశంలో చాలాకాలంగా ఉంటున్నావ్. నువ్వు హిందువు అయితే నీకు special status ఉంటుంది. అయితే నీ సిటిజన్షిప్ మేము confirm చేసి కన్సిడర్ చేస్తాం. అయితే మీరు ముస్లింలు అయితే ఒక న్యాయము, హిందువులు అయితే ఒక న్యాయము, అన్నది అక్కడ వాళ్ళు ప్రస్ఫుటంగా చూపెడుతున్నారు. అందుచేత ఇది ముస్లిం సోదరులకి, హిందువేతర, Non Hindu Communities కి ఇది తప్పకుండా అభ్యంతరం. ఇండియా ప్రజాబంధుపార్టీ కూడ దీనిని ఖండిస్తుంది, వ్యతిరేఖిస్తుంది. మేము ఎప్పుడు చెప్పేది ఒక్కటే నీకులం, నీమతం ఏది అని అడగకుండా ఈ గడ్డ మీద బ్రతుకుతున్నవారికి మీరూ సమాన న్యాయము వర్తింపచేయండి. ఒక మనిషిని మనిషిగానే చూడండి. తప్ప మతాన్ని బట్టి, కులాన్ని బట్టి అతనికి status ఇవ్వవద్దు. ఇదే ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క స్పష్టమైన డిమాండ్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్గారి యొక్క ఆశయాలకి అణుగుణమైన attitude అని మేము స్థిరంగా నమ్ముతున్నాం. ఇంకా మాకు రెండవ ఆలోచన లేనే లేదు. Confusion లేనే లేదు.