(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను అప్పుడే, అక్కడే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను. లూసిఫర్ మహాజ్ఞాని గనుక వాడు దేవుడు మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు. ఎలా react అవుతాడో చూడడానికి, ఏ పాపం అయితే చేయాలనుకున్నాడో, ఇతరులచేత ఆ పాపమే చేయించాడు. మీరు విశ్వచరిత్రగ్రంథం చదవండి. దేవుడు నాచేత రచింపచేసిన విశ్వచరిత్ర చదవండి. విపులంగా చెప్పాను. వాడు ఎప్పుడు కూడ ఏం చేస్తాడంటే వాడు చేయాలనుకున్న పాపాన్ని ఇతరులకు ప్రేరేపించి, ఇతర విశ్వపౌరులను ప్రేరేపించి, దేవునికి ఏ లేవల్లో కోపం వస్తుందో, దేవుడుఏరీతిగా శిక్షిస్తాడు అనేది వాడు అంతాచూసి, ఇది అంత ప్రమాదకరం కాదు అనుకున్నప్పుడు వాడు ఆ పాపం చేస్తాడు. మీరు విశ్వచరిత్ర చదవండి మీకు జవాబు దొరుకుతుంది.