183. ప్రశ్న : సృష్టి ప్రారంభమై 6వేల యేండ్లు అని బైబిల్ చెబుతుంది కదా! సార్.  మరి శాస్త్రవేత్తలు శిలాజాలు, లక్షల సంవత్సరలు డైనోసర్లు శిలాజాలు ఉన్నాయి అంటున్నారు? ఇదిసాధ్యమా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     ఆదాము సంబంధిత మానవజాతి ఇప్పుడు, ఈ భూ మండలము, నీవు నేను మానవజాతి ప్రారంభమై 6వేల సంవత్సరాలు.  భూమి ప్రారంభమై 6000 సంవత్సరాలు అని బైబిల్ చెప్పలేదు.  ఎవరు చెప్పలేదు.  భూమి ఎన్నో లక్షలసంవత్సారాల నుండి ఉన్నది. అయితే దేవుడు భూమిని నివాసయోగ్యం చేసాడు అని యెషయగ్రంథం 45:18 లో ఉంది. భూమిని నివాసయోగ్యంగా చేసెను అనే చెబుతుంది కదా! నివాసులు లేకుండా నివాస యోగ్యంగా ఎందుకు చేస్తాడు. అప్పుడు జంతువులు, వేరే రకమైన జ్ఞానవంతమైనటువంటి, వ్యక్తులు కూడ ఉన్నారు.  వాటి చరిత్ర వివరణ మనకు తెలియదు.  మనకు తెలిసింది ఆదాముతో ప్రారంభమైన ప్రస్తుత యుగంను గూర్చి మాత్రమే.  అంతకు ముందు ఎన్నో యుగాలు గడచిపోయినాయి అని బైబిల్లోనే ఉంది.  ఆ యుగముల అంతమందు యేసుప్రభు వచ్చాడు అని హెబ్రీ పత్రిక 9 చివరిలో రాసాడు. మీరు నేను బ్రతుకున్నది ఆదాముతో ప్రారంభమైన యుగము.  ఇది ఆఖరియుగం అని బైబిల్ చెబుతుంది. అంతకు ముందు యుగాల, ప్రాణుల శిలాజాలు దొరకొచ్చు. అది పెద్ద ప్రశ్నకాదు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)