182. ప్రశ్న : లూసిఫర్ పరలోకంనుండి త్రోయబడినప్పుడు అంతకంటే ముందు త్రోయబడినవారు ఆయనని ఆహ్వనించారు.  అని మరో సందర్భంలో చెప్పినట్టూ విన్నాను మొదట పాపం చేసింది లూసిఫర్ కదా! లేకపోతే వీళ్ళ మొదటి పాపం చేసారా! వీళ్ళు త్రోయబడ్డారు, మొదట అయితే వీళ్ళే మొదట పాపం చేశారా అని?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    నేను అప్పుడే, అక్కడే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను. లూసిఫర్ మహాజ్ఞాని గనుక వాడు దేవుడు మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు. ఎలా react అవుతాడో చూడడానికి, ఏ పాపం అయితే చేయాలనుకున్నాడో, ఇతరులచేత ఆ పాపమే చేయించాడు. మీరు విశ్వచరిత్రగ్రంథం చదవండి. దేవుడు నాచేత రచింపచేసిన విశ్వచరిత్ర చదవండి.  విపులంగా చెప్పాను. వాడు ఎప్పుడు కూడ ఏం చేస్తాడంటే వాడు చేయాలనుకున్న పాపాన్ని ఇతరులకు ప్రేరేపించి, ఇతర విశ్వపౌరులను ప్రేరేపించి, దేవునికి ఏ లేవల్లో కోపం వస్తుందో, దేవుడుఏరీతిగా శిక్షిస్తాడు అనేది వాడు అంతాచూసి, ఇది అంత ప్రమాదకరం కాదు అనుకున్నప్పుడు వాడు ఆ పాపం చేస్తాడు. మీరు విశ్వచరిత్ర చదవండి మీకు జవాబు దొరుకుతుంది.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram