(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను మొట్టమొదట ఆ మహానాయకురాలు. మహా తల్లి మాతృమూర్తి, ఆమె స్మృతికి ఈ channel ద్వారా నేను నివాలర్పిస్తున్నాను. అమ్మగారు మహానుబావురాలు, అమ్మగారు ఇప్పుడు జీవించి ఉంటే ఆమె పాదాలు కడగడానికి కూడ నేను చాలా అతిశయించేవాన్ని. అమ్మగారు కాళ్ళకి దండం. అంతమంచి వ్యక్తి, నాయకురాలు సంస్కర్త, గొప్ప సాహాసికురాలు. అమ్మగారికి 9సంవత్సరాల ప్రాయంలోనే బాల్య వివాహం అయ్యింది. 12 అనుకుంటా జ్యోతిబాపూలే గారికి, ఆమె అప్పటినుండి కూడ భర్తగారి యొక్క ప్రోత్సాహంతో ఆమెకు పెళ్ళి, అయ్యినప్పుడు ఆమెకు అక్షరాలు రావు. మహాత్మపూలే గారు ఆ బాల్యదశలో ఆయన చదువుకోవడమే కాకుండా తన భార్యకు చదువు నేర్పించాడు. తరువాత ఆమెను Teacher గా తీర్చిదిద్దాడు. చెప్తే చెప్తాడు గాని ఆమెకు కూడ దమ్ము, దైర్యం ఉండాలి కదా! అప్పటి సమాజం అంతా వ్యతిరేకం. కాని నేను ఒకటి చెప్తాను. ఏంటంటే నేను Basically భారతదేశ భక్తున్ని. I am a patriotic india citizen I love my country . మొట్టమొదట సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలంటే ఆమె మొట్టమొదటి లిటరేట్ లేడి, అనే మాట అతిశయోక్తి. నా దేశం అంటే నాకు మా అమ్మ ఎంత ఇష్టమో, అంత ఇష్టం. ఎవరిని కించపరిచే విధంగా బయటోడు మాట్లాడినా చెప్పుతీసుకుని తంతా. నా దేశంలో ఎవరైనా మాట్లాడినా అలాగుv కాదు తమ్ముడు మనదేశం గొప్పది అని చెబుతాను. ఇంక ఏంటంటే సావిత్రి బాయి పూలే మొదట అక్షరజ్ఞానం కలిగిన స్త్రీ, అది తప్పు. ఎందుకంటే వేదములలోనే చతుర్ వేదలాలో ఋషికలు ఉన్నారు. ఋషి అంటే పురుషుడు ఋషిక అంటే స్త్రీ. వేదమంత్రములను దృష్టించి గ్రంధస్యం చేసిన మహా జ్ఞానవంతురాలైనటువంటి ఋషికలు బిసి 2,000 ఏండ్లనాడే ఉన్నారు. మరి అలాంటప్పుడు వారందరు లిటరేట్ కాదా! మొల్ల రామాయణం ఉన్నది. కవయిత్రి మొల్ల ఆమె ఆంధ్ర, సంస్కృత పండితురాలు కాకపోతే ఎలా రాసింది? అయితే వేద కాలములో ఉన్న స్త్రీ స్వాతంత్య్రం తరువాత పురాణరచన కాలం వచ్చినాక మనువాదం ప్రవేశించాక, భారత సమాజం అంతా నాశనం అయిపోయింది. కులవివక్ష, మతవివక్ష, లింగవివక్ష అన్ని నేర్పించింది మనువాదం. స్త్రీలకు ఒక equal status లేకపోయినాకా ప్రవేశించి అప్పుడు సమాజంలో ఉన్న ఈ వివక్షను చూసి, మహాత్మ పూలే గారు అమ్మగారు సావిత్రి బాయి పూలే గారు, సమాజం మీద తిరుగుబాటు చేసారు. ఇంకో గొప్ప విషయం వాళ్ళు ఎస్.సి.లు కాదు. (దళితులు) బిసి అయ్యుండి దళితులుకొరకు బాధపడ్డారు. అంటే వాళ్ళ అంటరానితనంకి వాళ్ళు ఎప్పుడు suffer కాలేదు. వాళ్ళు ఊర్లోవాళ్ళే, ఊరి బయటోల్లుకాదు. అని ఆవేశపడిన అద్భుతమైన జంట. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. పిల్లలుపుట్టకపోతే ఒక బ్రహ్మణ అబ్బాయిని పెంచుకున్నారు. ఊరిబయట ఉన్నదళితులకు వీళ్ళకు సంబంధం లేకపోయిన వాళ్ళకొరకు ఆవేశపడ్డారు. ఈ దుర్మార్గపు వ్యవస్థను సృష్టించింది బ్రాహ్మాణులు అని వాళ్ళ మీద కూడ పగపెట్టుకోలేదు. అటు ఒక బ్రాహ్మణునికి ఆశ్రయం ఇచ్చారు. వెలివేయబడిన వారికికూడ ఒక అండగా నిలిచారు. కనుక వాళ్ళ గొప్పతనం ఇంత అంతా అని చెప్పడానికి వీలులేదు. ఆమ్మగారి మీద Already ఒక Movie కూడ చేసినట్టున్నారు. ఇంకా TV సీరియల్స్ గాని, ఇంకా అనేకమైన Movies కాని రావాలి. దళితవాదమును, దళిత ఉద్దరణ వాదమును, దళిత ఉద్యమాన్ని గూర్చినటువంటి మహానుభాహులు ఎంతమందో ఉన్నారు. ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మగారు ఉన్నారు. ఆయనమీద కూడ సినిమా రావాలి. మరి అలాగే దళిత ఉద్యమకారులు, దళిత ఉద్యమం కొరకు ఉద్దరించిన పెరియర్రావు స్వామిగారు ఇలాంటి వాళ్ళ మీదకూడ ఇంకా ఎక్కువ రావాలి. వచ్చినాయి ఇంకాఎక్కువ రావాలి. భారతదేశాన్ని ఈ వాదముతో ఈ మహానుభావులను గూర్చిన చరిత్రతో నింపేయాలి. అప్పుడు ఇంకా మనకు అసిఫాభాను కేసులుగాని, ఈ ప్రియాంక రెడ్డి కేసులు గాని ఉండవు. అది మాకున్న దర్శనము, మాకున్న భారము, ఈ దినానా దేశంలోని మహిళ మణులందరికి కూడ సావిత్రిబాయ్ పూలే జన్మదిన సందర్భంగా జై భీమ్ తెలియచేస్తున్నాను.