186. ప్రశ్న : సార్ ఈ నూతన సం॥లో చాలా మంది పాస్టర్లు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది(promise cards).  ఒక పెళ్ళికాని అబ్బాయికి నీ సంతానం అభివృద్ధి చెందును అని వాగ్ధానం వచ్చింది. మరి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. దీని వాగ్దానం పరిస్థితి ఏంటి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     అయితే ఒక విషయం ఏంటంటే with all due respect to all great spritual leaders like భక్తసింగ్ గారు వాళ్ళు అంటే నాకు చాలా అపారమైన గౌరవం అని అందరికి తెలుసు. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళంటే నాకు ఎంత అపారమైన గౌరవం ఉన్నాసరే, అంశాలవారిగా పార్లమెంటులో చిన్న పార్టీలకు మద్దతు ఇచ్చినట్టే. అధికార పార్టికీ, ఇచ్చినప్పుడు అంశాల వారి మద్దతు అంటారు.  Blind గా పార్టీనీ merge చేయడం ఉండదు. పార్టీ లీనమవ్వడం ఉండదు. వాళ్ళు వేరే సీటు, వీళ్ళు వేరే గాని అంశాలు మాకు నచ్చితే మేము మద్దతు ఇస్తాం అనేది విషయం. అలాగే నేనుకూడ ఈ మహానుబావులందరిని గౌరవిస్తాను. దేవుడు తరువాత వాళ్ళంత నాకు. గాని ఒక విషయం సరిగా కాదు అనిపిస్తే దీన్ని ఒప్పుకోను అని కూడ చెప్తాను. Ultimately మనందరము దేవున్ని సేవకులమే. ఇప్పుడు భక్తసింగ్ గారు కూడ మొదలుపెట్టారు.  ఏంటంటే వాగ్దానాలు ఇవ్వడము. వాగ్ధానాలు ముందు ప్రార్ధన పూర్వకంగా elders కూర్చుని చక్కగా రాస్తారు. తరువాత ఒక్కక్కరికి ఒక్కొక్క వాగ్ధానం వస్తుంది. చాలా మంది watch night service కు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళడం, నూతన సంవత్సర వాగ్ధానం కొరకే అని వెళ్ళడం. ఇక సంవత్సరం అంతా ఈ వాగ్ధానం పట్టుకుని జీవిస్తారు. అదంతా కూడా Ophirministries , మా సంస్థలో అసలు మనం అదంతా అంగీకరీంచలేము.  ఎందుకంటే బైబిలోనే ఒక వాగ్దానం తీసినాకు ఇవ్వడానికి నువ్వుఎవరు? వాళ్ళే పాడుతారు మళ్ళీ గ్రంథ వాగ్ధానంబులన్ని నావే.  ప్రతి అధ్యాయము వరస వచనము అనే పాట ఉంది. వాగ్ధానంబులన్నీ నావే అని చెప్పటం ఏంటి? నువ్వు ఒక వాగ్ధానం తీసి ఇవ్వడం ఏంటి? సెల్ఫ్ contradiction గదా! కాబట్టి ఎప్పుడు సంవత్సరానికి నువ్వు నాకు వాగ్దానం ఇవ్వడం కాదు. ప్రతి విశ్వాసిని చాలి, ఎలా పెంచాలంటే అనుదినము అతను దేవుని సన్నిధిలో మోకరించి ఒక రోమా సమకాలీన ప్రాధాన్యత లవెన్స్ ప్రాముఖ్యత గలిగినటువంటి ఒక రీయల్ promise అప్పటికప్పుడు దేవుని యొద్దనుండి అనుదినం బైబిల్ థంలో నుండి పొందుకోవాలి అది మనిషిని బ్రతికిస్తుంది. ఏవో ఇట్లా వచ్చింది అనడానికి చిలకాజ్యోష్యానికి ఏమి  difference? చిలక కూడ ఏదో ఒక card తీసి ఇస్తది.  అట్లా ఆ card తీసిఇస్తే నీకు ఇలా జరుగుతుంది అని చెబుతారు. ఇది ఒక రకం క్రిస్టియన్ చిలక జ్యోష్యం (Christian) అందుచేత అలా చూసి వేరే వాళ్ళు. కూడ  నేర్చుకున్నారు. ఇలా పెడితే ఎక్కువ జనాలు watch night services కి వస్తరేమే అని ఇందకా మీరు చెప్పినట్టు, నిశ్చయముగా నీకు సంతానాభివృద్ధి కలుగజేచెదను, నీ పిల్లలను ఆశీర్వదించెదను అని వస్తే ఏంటండి నాకు పెళ్ళే కాలేదుగా అని అనుకుంటే అప్పుడు వాళ్ళు సమర్థింపు చెబుతారు. పెళ్ళి అయ్యాక పుడతారు బాబు. లేకపోతే నీ ఆత్మీయపిల్లలు బాబు అని ఏదోక రకంగా సర్థిచెప్పుకోవడం.  గనుక ఇప్పుడు ఒకనికి స్వస్థపరిచే యెహోవాను నేనే అని వస్తుంది. మరి ఇప్పుడు పిల్లలు పుడతారు అని వచ్చినోడికి ఏమైనా రోగంవస్తే దేవుడు స్వస్థపరచడా! అందరిని స్వస్థపరుస్తాడు. గనుక పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చెయ్యాలి.  ప్రతిరోజు బైబిల్ దవాలి.  మోకరించి ప్రార్థించాలి.  దేవుని తట్టు చూడాలి.  దేవుని నోటనుండి బైబిల్ ఆధారంగా ఏదైనా ఒక వాక్కు అనుదినం పొందాలి. గనుక ఏడాది మొత్తానికి ఏదో ఒక చిలక జ్యోష్యం టైపు ఒక card ని తీసిఇవ్వడం అనేది క్షేమాభివృద్ధికరం కాదు అనేది నా విశ్వాసం. వాళ్ళు అలాగా కొనసాగితే కొనసాగనివ్వండి కాని నేను నా వెయ్యి సంఘాలలోని పిల్లల్ని అలాగ పెంచలేదు.