187. ప్రశ్న : సాతాను అదృశ్యంగా ఉండి మాత్రమే ఎందుకు పరిపాలిస్తున్నాడు? కనబడేవిధంగా ఉండకుండా ఎందుకు అదృశ్యంగా మాత్రమే ఉంటాడు? భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడి ఉంది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     ఇది చాలా విచిత్రమైన ప్రశ్న, దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవదూతలు కూడ వాళ్ళ ఆత్మలు అని ఉంది. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు అని అంటాడు హెబ్రీలో మొదటి అధ్యాయం చివరలో.  గనుక వాళ్ళ ఆత్మలు, భౌతిక ప్రపంచంలో ఉన్న పదార్థాలతో వాళ్ళ దేహం నిర్మితం కాదు. గోడల గుండా వస్తారు, వెళ్ళిపోతారు.  ఈ భౌతిక పదార్థాలు ఏవి వాళ్ళను ఆపలేవు.  కావాలనుకుంటే కనిపిస్తారు. లేకపోతే కనిపించరు.  వాళ్ళు Basically వాళ్ళ యొక్క ఉనికి ఈ మాంస నేత్రాలతో చూడగలిగింది కాదు. వాడుకనబడాలి అనుకున్నప్పుడు పనిగట్టుకుని వచ్చి, వాడికున్న శక్తులన్నీ ఉపయోగించి కళ్ళకు కనిపించే విధంగా వాడు కొంత మేరకు వస్తాడు.   ఇప్పుడు మీరు, నేను ఒకరికి ఒకరం ఏ టైమ్ అయిన కనబడతాం. ఒకవేళ ఊరువెళ్ళిపోతే తప్ప, ఒకరికి ఒకరం ఎదురుగా కూర్చోని మీకు నేను కనబడకుండా పోలేను. అది రివర్స్ వాళ్ళకు ఎదురుగుండా ఉంటారు గాని కనబడేటట్లు రావడం కష్టం. వాళ్ళ ఉనికి వేరు This applies to all the spirit beings. దేవుడు దేవదూతలు, ఇప్పుడు దేవుని సేవలో ఉన్నోళ్ళు ఇంతకు ముందు పడిపోయినోళ్ళు. వాడు ఎందుకు ఉండలేదు అంటే అదే మాట మనం అందరిని అడగాల.  ఇప్పుడు మన చుట్టూ దేవదూతలు ఉన్నారు కాపాడుతున్నారు అంటున్నాం. మరి వాళ్ళు కనబడేటట్టు ఎందుకు ఉండలేరు అంటే గనుక అదేం ప్రశ్న? ఏలీషా పర్వతం చుట్టూ దేవదూతలు కావలిగా ఉన్నారు. ఏలిషా దాసుడు అన్నాడు యేలినవాడా, మనం నశించితిమి శత్రురాజులు సైన్యాన్ని పంపించేసారు అంటే భయపడోద్దు మనపక్షమున ఉన్న సైనికులు వాళ్ళ కంటే అధికంగా ఉన్నారు. యోహోవా దేవా వీడి నేత్రాలు, కళ్ళు తెరవమని ప్రార్థనచేసాడు ఏలీషా.  అప్పటిదాక అక్కడే ఉన్నారు కనబడలేదు. దేవుడు వీడి కళ్ళు తెరవగానే ఆపర్వతం అంతా చుట్టు అగ్నిరధములు అగ్నిగుఱ్ఱాలతోటి నిండివున్నాయి. అతను చూసాడు. అప్పటి దాకా అక్కడే ఉన్నాడు కనబడలేదు. ఇప్పుడు ఈ రూమ్లో కూడ దేవదూతలు ఉన్నారు మనకు కనబడరు. ఆ ప్రశ్న అడిగిన పాస్టరుగారి ప్రక్కన కూడా చాలా మంది ఉన్నారు.  వాళ్ళు ఆయనకి కనబడరు.  అదృశ్యప్రపంచం మన చుట్టూ ఆవరించి ఉన్నది. ఇది దేవుని సృష్టిలో ఉన్న ఒక వాస్తవ పరిస్థితి భౌతిక శరీరాలతో ఉన్నమనం భౌతిక నేత్రాలలో చూడలేని ప్రపంచమే చాలా ఉన్నది చూడగలిగిందే చాలా తక్కువ దానికి చెందిన దేవుడుగాని, దేవదూతలు గాని పడిపోయిన వాళ్ళు దెయ్యాలు గాని అందరు, దేవుడు మన చుట్టూ ఉన్నాడు ఎందుకు కనబడడు అంటే, మనమేమి చెప్పగలం దానికి ఆయన కనబడాలి అనుకున్నప్పుడు ఆకేష్నల్గా కనిపిస్తాడు. దేవదూతలైన దేవుని చిత్తం అయినప్పుడు కనబడుతాడు వీళ్ళుకూడ ఏవైనా ఒక ఆకారం వేసుకుని మనముందుకు రాగలుగుతారు.  కాని వానికి అలాకనబడకుండా ఉంటేనే వాడిని advantage ఎక్కువ.