189. ప్రశ్న : నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది. ప్రార్థించిన తరువాత అభిషేకం పొందినప్పుడు ఈ పరిశుద్దాత్ముడు వస్తాడా? లేక పైనుండి వస్తాడా, అభిషేకంగా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    జ. ఇప్పుడు నేను, చెబుతాను మీరు, మీచెయ్యి ఇలాగు పట్టుకొని ఊ…… ఫ్ అని ఊదండి. ఈ గదిలో ఉన్న గాలే వస్తదా? లేక క్రొత్తగా ఇంకా ఎక్కడనుండి అయినా వస్తదా? అంటే మనం ఏమి చెప్పగలం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి.  పరిశుద్ధాత్మ దేవుడే మనం భరించగలిగేంత భాగాన్ని విశ్వసించినప్పుడు మనలోపలికి వచ్చేస్తాడు.  ఆ తరువాత అభిషేకం కావాలనుకున్నప్పుడు ఇంకా అధికంగా కావాలనుకున్నప్పుడు ఆత్మదేవుడు తైలంగా మన తలమీదికి వస్తాడు. అయితే ఆయనే ఈయన, ఈయనే ఆయన.  పరిశుద్ధాత్మ అనే ఆయన సర్వాంతర్యామి, ఆయన లేని స్థలమే లేదు. అందుకే గాలితో పోల్చాడు. ఈ Room లో గాలి ఉంది.  ప్రపంచమంతంటా గాలి ఉంది. కాని కిటికిలోంచి గాలి వస్తుంది.  అంటే గాలి ఉండికూడా అది ఉన్నట్టు మనం అనుభవించకుండా ఉంటాం. మనం అనుభూతిలోనికి వస్తుంది,  మనం ఊ..ఫ్…. అని ఊదినప్పుడు.  కాబట్టి దేవుడు ఉండటం మన అనుభూతిలోనే ఉండకపోవటం మన అనుభూతిలో ఉండేటట్టు దేవుడు రావడం  ఈ రెండు జరుగుతాయ్.  అందుచేత పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్న ఆయన మన బయట కూడ ఉన్నాడు. ఇప్పుడు నా ఊపిరితిత్తులో గాలి ఉంది. ఈ room లో ఉంది.  ఇంకా ఊరిబయట అంతటా ఉంది. అలాగే మనలో ఉన్నట్టువంటి పరిశుద్దాత్మదేవుడు బయటకూడా ఉన్నాడు, విశ్వం అంతా ఉన్నాడు.  గనుక అక్కడనుండి మరింతా అధికమైన ప్రభావము, ఇంటెన్సిటి, సాంద్రత, అధిక విధంగా మనం అనుభవించగలనటువంటి శక్తితో ఆయన మన మీదకి మళ్ళీ వస్తాడు.  ఇప్పుడు ఊపిరితిత్తులలో ఉన్నగాలి కిటికీలోంచివచ్చిన గాలి వేరువేరా మరి?

                ఆ కిటికిలోంచి రావాల్సిన గాలే ఇంతకు ముందు నేను పీల్చినప్పుడు నాలోపలికిపోయింది నేను పీల్చినప్పుడు మొత్తం పోలేదు.  విశ్వంలో గాలంతా నాలోకి పోలేదు.  నేను పీల్చినంతే పోయింది.  నేను పీల్చకుండా మళ్ళీ వదిలేసిన గాలి అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంది. అది పరిశుద్ధాత్మ రావడం అంటే.