190. ప్రశ్న : Pregnant  ఉన్నవాళ్ళు బాప్తిస్మము తీసుకోనవచ్చా సార్? బాప్తిస్మం తీసుకున్నాక Pregnant ఉండి బల్ల తీసుకోనడానికి రాకుండా ఉంటారు కదా! ప్రయాణం చెయ్యొద్దు అంటారు కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     Pregnant ఉన్నవాళ్ళు బాప్తిస్మము ఖచ్చితంగా తీసుకొనవచ్చు.  ఏమి అభ్యంతరంలేదు. ఎందుకుందలా! నేను చెబుతున్నాను ప్రయాణం చెయ్యొద్దు అంటే నిండుగర్భిణి గా ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు గతుకులరోడ్లు ఎత్తెసి, కుదేసి ప్రయాణాలు చేస్తే బిడ్డకు ప్రమాదం.  ప్రసవకాలం రాకముందే ఇంకా ఏమైన గర్బస్రావం జరగొచ్చు.  బిడ్డకు దెబ్బ తగలొచ్చు.  ఆయాసం కలగొచ్చు.  అందుచేత ఆరోగ్యరీత్యా దాన్ని వద్దు అంటారు.  తప్ప ఆత్మీయంగా కారణాలు ఏమి లేవు. స్త్రీ గర్భీణిగా ఉన్నా లేకపోయిన ఆమెకు monthly menses ఉన్నా లేకపోయినా సర్వకాలసర్వావస్థలో శరీరస్థితి ఎట్లా ఉన్న సరే, ఆరోగ్యంగా ఉన్న సరే, ఆత్మశుద్ధి కలిగి స్త్రీలు తప్పకుండా ప్రభుబల్ల తీసుకోవచ్చు.  ఆమెకు ఏ పరిస్థితులు శారీరకంగా, ఉన్న స్థితి ప్రభుబల్లకు ఎప్పుడు ఆటంకం కాదు.  ప్రార్థనకు కాని  దైవ సహవాసంకి గాని ఆటంకం కాదు. అయితే ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేము అంటే, వాళ్ళకే కాదు వాళ్ళు గర్భిణీగా ఉన్నందుకు, periods ఉన్నందుకు కాదు, ఎవరికైనా బాగా high temperature ఉండి మలేరియానో, టైఫాయిడో వచ్చినవాడు ఆదివారం గుడికి వెళ్ళడు.  ప్రభుబల్ల తీసుకోడు.  అది వేరే విషయం. అది health issue మాత్రమే.  తప్ప Spiritual issue కాదు. ఆత్మసంబంధమైన issue కానేకాదు.