(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మీకు అభినందనలు చాలా మంచి ప్రశ్న అడిగారు ! అయితే నేను తప్పక సమాధానం చెబుతాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే దావీదు, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. దేవుని మైండుకు దావీదు మైండు ట్యూన్ అయిపోయింది. అయితే దావీదుకు దేవుని మనసులో ఉన్నటువంటి ప్రకంపనలు, దేవుని మనస్సులో ఉండే మెంటల్ Waves అనేవి దావీదుకు కొంతవరకు స్పర్శలోకి, అతని యొక్క అనుభూతిలోకి వచ్చాయన్న మాట ఇక్కడ బత్సెబను దావీదు పెండ్లి చేసుకోవడం అనేది ఒక గొప్ప మర్మము. విషయమేమిటంటే, దావీదు బత్సెబను పెళ్ళిచేసుకుంటాడు. అనే సంగతి దేవుడి ప్రణాళికలో ఉన్నది. అది 50% దావీదు పొరపాటు. దేవుని ప్రణాళిక ప్రకారము తప్పకుండా ఈ బత్సెబ యొక్క భర్త చనిపోతాడు. ప్రసంగి 8:8లో ఒకని మరణ దినము ఎవనికిని వశము కాదు అని సొలోమోను మహారాజు అంటాడు. ఒకని మరణదినము ఎవరికిని వశముకాదు. నియమించబడ్డ దినములో ఒకటైన జరగక ముందే నా దినములన్ని నీ గ్రంథములో లిఖితములాయెను అని దావీదు అంటాడు క్రీర్తనలు 139లో. గనుక ఊరియా యొక్క మరణదినము కూడా రాసి పెట్టాడు. ఆ దినమున దావీదు ఏమి చేయకపోయినా తప్పకుండా ఉరియా చచ్చిపోతాడు. ఆ తరువాత విధవరాలిని పెళ్ళిచేసుకోవడం ధర్మశాస్త్రం ప్రకారం క్రమమే, న్యాయమే గనుక తప్పకుండా దావీదు బత్సెబను పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత కలిగేటటువంటి సంతానం సొలోమోను యేసుకు ముంగుర్తుగా ఉంటాడు. మహాజ్ఞానిగా ఉంటాడు. బత్సెబ కూడా మహాభక్తురాలు. గనుక తన కొడుకును ఉపదేశం చేసి పెంచుతుంది. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకుంటే 2వ సమూయేలు గ్రంథములో 7:12 నీ దినములు సంపూర్ణములగునపుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను! అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను; అన్నాడు. అంతేకాదు సొలోమోను స్వయానా చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే 2దినవృత్తాంతములు 6:8-9 దావీదు సెలవిచ్చునదేమనగా (అయితే యోహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్ద్యేశించిన యుద్దేశ్యము మంచిదేగాని! నీవు ఆ-మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును! అలాగే 1దినవృత్తాంతములు 17:12 నీవు మందిరము కట్టకూడదు. నీ సంతానమే మందిరాన్ని కడుతుంది అని చెప్పాడు. అలాగే 1దినవృత్తాంతములు 17:12 అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను! అతను ఎవరు అనగా నీ సంతతి. నీ సంతానమును హెచ్చించెదను అన్నాడు. గనుక ఇవన్నీ జరిగినప్పుడు ఈ ప్రవచనాలు వచ్చినపుడు దావీదు నీకొక కొడుకు పుడతాడు ఆ కుమారుడు నాకు మందిరం కట్టిస్తాడు. అని చెప్పినప్పుడు ఇంకా దావీదు దృష్టి బత్సెబ మీద పడనే లేదు. దేవుడు భవిష్యత్తు దర్శనము చూసి, దావీదు లోనుండి పుట్టబోయే సొలోమోనును దేవుడు ముందుగా చూసాడు. సొలోమోనులో 50% బత్సెబ. ఏ మనిషి అయినా సరే 50% శాతం తండ్రి, 50శాతం తల్లి పోలికలు ఉంటాయి. గనుక దేవుడు సొలోమోనును చూసాడు అంటే దావీదు యొక్క గర్భవాసమునుండి దావీదు ద్వారా బత్సెబకు పుట్టే ఆ సొలోమోనునే దేవుడు చూశాడు. అతడే కడతాడు అన్నాడు. అతడే కట్టాడు కూడా గనుక ఒక నాటికి ఏ తరమున, ఏ సంవత్సరాన, ఏ సమయానికి ఆ యొక్క మందిరము శంకుస్థాపన జరగాలి అనేది దేవుడు అంతా రాసి పెట్టాడు. సరియైన సమయంలో, తప్పకుండా బత్సెబ దావీదు భార్య అవుతుంది. అయిన తరువాత వారికి సొలోమోను పుడుతాడు.
దేవునికి DNA Code ఇంకా మొదలైనవి అన్ని కూడా ముందే తెలుసు. “God is like a Genetic Engineer” దేవుడికి ఎవరు, ఎప్పుడు పుడతారో అంతా తెలుసు కాబట్టి సొలోమోను పుట్టుకను ప్లాన్ చెప్పాడు. అయితే ఇక్కడ వచ్చినట్టువంటి ఇబ్బంది ఏమిటంటే తాను ఎలాగు పెళ్ళి చేసుకోవలసి ఉంది కాబట్టి దావీదు దృష్టి కాస్త ముందుగానే బత్సెబపైకి వెళ్ళింది. దావీదు ఎందరినో అందగత్తెలను చూసి ఉంటాడు. కాని బత్సెబను చూసి ఎందుకు మనసుపడ్డాడు అంటే ఇంతకంటే అందగత్తెలు లేరని కాదు. కాని ఆయనకు హృదయంతరాలో తెలుసు. అంతరంగంలో అంతరాత్మాలో కలిగిందన్నమాట. కనుక ఆమెతో ఒక కొడుకును కనడం దేవుని చిత్తమేగాని ముందుగానే ఆమె గర్భవతి అయ్యింది. అప్పుడు పుట్టేవాడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు కాదు. అందుచేత దేవుడు వానిని తీసేసుకున్నాడు. తీసేసుకున్న తరువాత దుఃఖదినములు తీరిపోయినా తరువాత మరల ఆమెను దావీదు పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళిచేసుకున్న తరువాత అప్పుడు దేవుని టైం వచ్చింది. అప్పుడు సొలోమోను పుట్టాడు. సొలోమోను చెబుతాడు నా తల్లి ఉపదేశమును బట్టి నేను ఇలాగు భక్తిలో ఉన్నాను అని చెబుతాడు. అయితే ఊరియాను చంపాల్సి వచ్చింది. ఎందుకంటే అతడు స్వతహాగా చచ్చిపోయి దేవుడే ఈమెను తీసుకొచ్చి ఇతనికి భార్యగా ఇచ్చేదాక దావీదు ఆగలేదు. దుష్టుడేంటంటే ఎలాగు జరగాల్సిన పనిని కాస్త ముందుగా జరిపించేద్దాం అని Push చేసాడు అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా చాలా పసులు ఒక మంచిపనిని దేవుని టైంలో చేస్తే అది మంచి పని, లేకపోతే అది దేవుని టైంకి ముందు చేసినా వెనుక చేసినా ప్రమాదం. ఇది విశ్వాసులందరు నేర్చుకోవలసిన పాఠం. అంతేగాని దావీదు బత్సెబ ఇద్దరు వ్యభిచారులు కాదు. ఇద్దరు భక్తులే కాని టైం అనేది Important . దావీదు యొక్క చరిత్రలో ఊరియా సంధర్భంలో ఊరియా చనిపోయాడు అని చెప్పిన లేఖనపు సాక్ష్యం విషయంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఇది.