197. ప్రశ్న : భారతదేశంలో ఉగాది అనే పండుగ వస్తుంది, నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి తీసుకోవాలి.  2020 జనవరి 1 రోజున నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసాము.  అవి మన సంవత్సరము కాదు అని Social మీడియాలో అంటున్నారు.  దాని గురించి తెలియజేయండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     జనవరి అనేది రోమా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంవత్సరం. సౌరమాన సంవత్సరం. తరువాత బ్రిటీషు గవర్నమెంట్ అడాప్ట్ చేసారు.  మనం వాడుతున్నది ఇప్పుడు బ్రిటీషు క్యాలెండరు. అంటే అంతకుముందు రోమన్ క్యాలెండరు. ఇది కాకుండా మనం ఉగాది నుండి సంవత్సరం మొదలేసుకోవాలి అని అంటున్నారు. సరే అనుకోవచ్చు.  భావ ప్రకటన స్వాతంత్ర్యం అందరికి ఉండవచ్చు. కాని దేనికైనా కొంచెం ప్రయోజనం ఉండాలి. ప్రపంచమంతా కూడా జనవరి నుండి క్యాలెండరు ప్రారంభించుకొని నూతన సంవత్సరం అరంభమయ్యింది. అని Transactions గాని, లావా దేవీలు గాని, అంతర్జాతీయంగా, జాతీయంగా అందరు చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఉగాది నుండి సంవత్సరం మొదలుబెట్టుకుంటా, నా సంవత్సరం అంటే అది ఏ విధంగా ప్రయోజనకరం? అని నేను అడుగుతున్న.  మనది అమాయకత్వం అనుకొని, అజ్ఞానం అనుకొని వాళ్ళు ఇప్పుడు మనకు జనవరి కాదు, ఉగాదే మనకు ప్రారంభము అని మీరంటున్నారు.  ఈ ఉగాదినే ఇతరదేశాల్లో పాటించమని మీరు కన్విన్సు చేస్తే అప్పుడు ప్రపంచమంతా ఒక క్యాలెండరులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ప్రపంచమే ఒక గ్రామంలాగా ప్రతి విషయంలోను ప్రపంచం ఒక చిన్న కుటుంబం అయిపోయింది. గనుక మనం ప్రపంచమంతా కలిసి ఏది, ఏ క్యాలెండరు పాటిస్తున్నారో దాంట్లో మనం ఉంటేనే మనం అందరితో కలిసి ముందుకు సాగుతాం. అలా కాదు నేను వేరేది పెట్టుకుంటాను అంటే ఈ ఉగాదిని జర్మనీ, అమెరికా అమోదించేటట్టు చేస్తే చేయండి. అది నాకు గర్వకారణమే కాని అలా చేయలేదు.  అని అన్నప్పుడు దీనిని వద్దు అనడంలో ఏమిటి ప్రయోజనం? ఇది నిష్ప్రయోజనమైనటువంటి ఒక తెలివితక్కువ వాదన.  అర్థంపర్థం లేనటువంటి ద్వేషం. చివరికి ఏంటంటే ఇతరులు Right చెప్పిన తప్పు అనేంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా అర్థం లేనటువంటి ద్వేషంతో కూడిన వాదన దానిని పట్టించుకోవద్దు. వీళ్ళు ఎప్పుడు కూడా మనకు శాలివాహన శకం ఉన్నది, చంద్రమాన సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. అని చెప్పినా అంతర్జాతీయ సమాజం వీళ్ళు చెప్పిన క్యాలెండరు ఎప్పటికి అంగీకరించదు.