198. ప్రశ్న : సాతాను సర్వాంతర్యామినా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     సాతాను సర్వాంతర్యామి కాదు. సృష్టికర్తయైన దేవుడొక్కడే సర్వాంతర్యామి. అయితే అన్ని దేశాలలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడానికి సాతానుకు నెట్వర్కు ఉన్నది. వానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నది. దాని ద్వారా సమాచారం సేకరిస్తాడు.  తప్ప తనకుతానుగా అన్ని స్థలములలో ఒక్కసారి ఉండే పరిస్థితి లేనేలేదు. అది దేవునికి తప్ప ఇంకా ఎవరికీ లేదు.