12. ప్రశ్న : అంబేద్కరైట్ ని ఎలా నిర్వచిస్తారు? మీరు Christian గా ఉండి నేను అంబేద్కరైట్ అంటున్నారు కొంతమంది హిందు మార్గంలో ఉండి కూడా నేను అంబేద్కరైట్ అంటున్నారు. Muslims కూడా అంటున్నారు. అసలు అంబేద్కరైట్లకు ఉండవల్సిన లక్షణాలు ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: Fundamentalగా ఇస్లాం లేదా Christianగా ఉండి అంబేద్కరైట్ కావొచ్చు. కాని హిందువుగా ఉండి అంబేద్కరైట్ కావడం possible కాదు. ఎందుకంటే ఒకని character లేదా సమాజానికి చేసిన సేవనుబట్టి ప్రవర్తనను బట్టి కాకుండా by birth వాడు Superior వీడు inferior అనేది కుల వ్యవస్థ. కుల వ్యవస్థ లేని హిందుత్వం లేదు. గనుక అంబేద్కర్ యొక్క మౌలిక సిద్ధాంతం మనుషులంతా ఒక్కటే అని. గనుక అంబేద్కరిస్ట్ భావాన్ని కలిగియుండి మనుషులందరూ ఒకటి కాదు అనే మతంలో ఎలా ఉంటారు? అది self-defeating argument. అందుచేత మనుషులందరు ఒక్కటే అని నమ్మే ఏ మతంలో నైనా ఉండి అంబేద్కరిస్టుగా ఉండవచ్చు. అంతేగాని మనుషులందరూ ఒకటి కాదు. ఒకరు ఎక్కువ ఒక్కరు తక్కువ అని నమ్మే మతంలో ఉండి సమాజం అంతా ఏకం కావడానికి నేను పోరాడుతాను అనడం తాను కూర్చన్న కొమ్మనే నరుక్కోవడం. So, No problem I can be good christian and work for the equal justice in the society.