(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవుడు సృష్టించాడు అనేది ఆదాము, హవ్వలను సృష్టించినప్పుడైతే వారు వికలాంగులు కాదు. అయితే తరువాత వాళ్ళు దేవుడి స్వాధీనంలోనుండి వెళ్ళిపోయారు కదా. అప్పుడు సాతాను పరిపాలనలోకి మానవజాతి వచ్చేసింది. గనుక సాతాను పరిపాలనలోకి మనుష్యజాతి వచ్చేసాక వాడు అనేక డ్యామేజెస్ చేసాడు. చేసిన డ్యామేజెస్లో ఒకటి ఏమిటంటే వికలాంగులు పుట్టడం. అయితే దేవుడి పరిష్కారం ఏమిటంటే వీడు వికలాంగుడై నా, అన్ని అవయవాలు ఉన్నవాడు అయినా, ఈ శరీరం శాశ్వతం కాదు. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ శరీరంతో కష్టపడతాడేమొ కాని, అతడు యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరిస్తే, హృదయంలో యేసును చేర్చుకుంటే ఆ వికలాంగుడిగా ఉండే జీవితంలో కూడా తనకు సహాయం చేస్తాడు. ఆ తరువాత అతడు పునరుత్థాన శరీరుడై యేసు రెండవ రాకడలో అతడు మహిమ శరీరుడై అందులో అన్ని అవయవాలు కరెక్టుగానే ఉంటాయి. మళ్ళీ ఆదాము హవ్వలకు ఉన్నట్టు గనుక వాడు బ్రతికే జీవితకాలంలో వాడు కష్టపడడం అనేది సాతాను తెచ్చిపెట్టె గాయం అని, నష్టం అని అనవచ్చు. దానిని కూడా సువార్త అనేది రక్షణ అనుభవం అనే దానిని కూడా, కరెక్టు చేస్తుంది. ఇప్పుడు వికలాంగులు మరణించి మళ్ళీ యేసు రెండవ రాకడ సమయంలో లేపబడ్డప్పుడు వారు కొత్త దేహంలో వారు వికలాంగులు కాదు. అన్ని అవయువాలు ఉన్నవారే, కనుక యుగయుగాలు వారు ఆనందంగా ఉంటారు. గనుక వికలాంగులు అయిన వారు ఇంకా ఎక్కువ కారణమున్నది యేసుని అంగీకరించడానికి.