23. ప్రశ్న : 2సమూయేలు 12:8లో “నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారినీ నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన యెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును” అన్నాడు. దేవుడే అలా ఎక్కువ మంది భార్యలను ఇవ్వడం ఏమిటి?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: ఆయా కాలఘట్టములలో అమలులో ఉండిన ధర్మం; ఉదాహరణకు అబ్రాహాము శారాలను ఉదాహరణగా తీసుకుంటే; అబ్రాహామునకు హాగరును శారానే భార్యగా ఇచ్చింది. హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇష్మాయేలు మొరను విన్నాడు. మరి యాకోబు తీసుకుంటే రాహేలు, లేయా ఉన్నారు; మళ్లీ ఇద్దరు దాసీలు ఉన్నారు. మొత్తం పన్నెండు గోత్రాలు దాసీలకు కూడా కలిపి పుట్టారు. ఒక్క ఆమెకు పుట్టినవారు కాదు. ఆ విధంగా పాతనిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ social […]