87. ప్రశ్న : యేసుక్రీస్తు ప్రభువు మానవ అవతారమెత్తి భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన సర్వశక్తి మత్వము, సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం అంతా అక్కడే వదిలి పెట్టి భూమి మీదికి వచ్చాడు. అయితే మెల్కీసెదెకు గా ముందుగా వచ్చినటువంటి ఆయన ఎవరు? యేసు క్రీస్తు ప్రభువే ముందుగా మెల్కీసెదెకుగా వచ్చినట్టయితే మరి అప్పుడు ఆయనకున్న దైవత్వాన్ని తీసుకొని వచ్చాడా? దీనికి జవాబు చెప్పగలరు!
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: దైవభక్తి సాధకులు, దైవాద్వేషకులందరు కూడా అడగవలసిన, ఆలోచించవలసిన ప్రశ్న. మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు నజరేయుడైన యేసుగా, మరియ కుమారుడిగా మన మధ్యకు శరీరధారిగా వచ్చినటువంటి యేసునాధుడు అంతకుముందు కూడా చాలా సార్లు భూమి మీదికి వస్తూ ఉండినాడు. అనే concept చాలా మందికి ఒక కొత్త concept అది. చాలా మందికి అది తెలియదు. నాకు తెలిసి దాన్ని special emphasis (ప్రత్యేకమైన అంశం) గా నొక్కి […]