123. ప్రశ్న : బైబిల్ చదివినప్పుడు అక్షరం, అక్షరాన్ని నమ్మేవారున్నారు. ఆత్మను అనుసరించి నమ్మేవారు ఉన్నారు. ఈ రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు. బైబిల్లోనే కొన్ని ఒక వచనానికి, ఇంకొన్ని ఇంకో వచనానికి విరుద్ధమైన వచనాలున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాలను మీరు ఏదైనా గ్రంథంలో ఎత్తి చూపించారా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: వాఖ్యాన పద్ధతులను గురించి నేనొక దేవుని యొక్క ప్రత్యేకమైన ఆజ్ఞను బట్టి 8 ప్రణాళిక గ్రంథాల్లో చివరిది. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను గూర్చినట్వంటి గ్రంథం ‘ప్రమాణ వాక్యం’ అనే పేరుతో పబ్లిష్ చేయడం కూడ జరిగింది. అసలు బైబిల్ని ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా వ్యాఖ్యానించాలి? బైబిల్లో ఎన్ని రకముల లేఖనములున్నవి? ఇంతకముందు కూడ హెర్మెన్యుటిక్స్ అనే టాపిక్ మీద ముందు చెప్పిన వాడ్ని నేనే […]