113. ప్రశ్న : ఇశ్రాయేలు దేశంమీద అందరి చూపు ఆకర్షిస్తున్నట్లూ కనబడుతున్నాయి. ఈ పరిస్థితులన్ని కూడ మొన్నటి వరకు నక్కలు రావడం తరువాత అన్ని మతాలను గూర్చిన సైన్స్ ఇశ్రాయేలు దేశంలో వెలువడడం! ఈ విషయాలన్నీ చూస్తా ఉంటే యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గరబడుతుందని, సూచనలైతే కనబడుతున్నట్లుగా కొందరు క్రైస్తవులు అభిప్రాయపడుతున్నారు. కొందరేమో 2000 ఏండ్లనుండి చూస్తున్నాం ఇంకా రాలేడు! అనే అపోహలో ఉన్నట్లుగా కనబడుతుంది.
అయితే సొలోమోను మండపం కూడ మళ్ళీ కట్టబడుతుంది అని అంటున్నారు. సొలొమోను మండపం ఎన్నిసార్లు కూల్చబడింది? ఎందుకు కూల్చబడింది? ఆఖరున ఎప్పుడు కట్టబడుతుంది? దీనికి యేసుక్రీస్తు రాకడకు ముందుండే పరిస్థితులేంటి ఇశ్రాయేలు దేశంలో? (అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: సొలోమోను కట్టించినటువంటి మందిరము బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో కూల్చి వేయబడింది. ఆ సమయంలోనే దానియేలు షద్రకు మేషాకు అబెద్నెగో చెరగా కొనిపోబడ్డారు. ఆ తరువాత చెర నివారణ అయిన తర్వాత […]