257. ప్రశ్న : మిమ్మల్ని ఈ తరంలో దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు సేవకులు ఎందరో విశ్వాసులు, పాస్టర్లు మీ సంఘాలలో ఉన్నారు. అయితే వాళ్లు మీతో మాట్లాడేటప్పుడు Daddy, అన్నా, Uncle అని సంబోధిస్తూ ఉంటారు. మీరు ఇంతటి సేవకులు అయినప్పుడు పాస్టరు గారు అని పిలవాలి కదా. అలా పిలవడం ఏమిటి? దీనిపై మీ స్పందన ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఇది పెద్ద సిద్ధాంత పరమైన విషయం కాదు. ప్రతీ మనిషికి నాయకునితో ఒక అనుబంధం ఉంటుంది. “యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యన్న కాడా” అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తుడు పాట రాసాడు. “మన ప్రియ సహోదరుడైన పౌలు అని పేతురు పౌలును గూర్చి రాసాడు. పౌలు రోమా 8:29లో “తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు”. యేసు ప్రభువా అనేక మంది […]