205. ప్రశ్న : మా సంఘస్థులందరు కూడా చాలా మట్టుకు అన్యుల ఆచారాలను పాటిస్తున్నారు. వీరిని ఎట్లా దేవుడి వైపు నడిపించాలో అనేది ఒక ఆలోచన.  ఏవిధంగా నడిపించాలో చెప్పండి? (వివాహనికి ముహూర్తం కొరకు పంతులు దగ్గరకు వెళతారు, ఏ చిన్న కార్యక్రమమైనా అన్యుల ఆచారాల ప్రకారం చేస్తారు)

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     ఒక మంచి రోజు ఉన్నది అంటారు.  ఏదైనా శుభకార్యం ఉంటే అమావాస్య రోజు చెయ్యరు.  అమావాస్యకు ముందు రోజు కూడ చెయ్యరు.  మంగళవారం పెళ్ళిలు చెయ్యొద్దు అంటారు.  తరువాత ముహుర్తం అని, పెళ్ళైతే ఇరుపక్షాల జాతక చక్రాలు లెక్కబెట్టి గుణించి గణించి అవన్నీ కరెక్ట్ మ్యాచింగ్ చూసి పెళ్ళి చేయాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు.  వీటన్నింటిని కొట్టివేయాలి క్రైస్తవులమైన మనం ఇవి పాటించకూడదు అనేది చాలామంది పాస్టర్లు చేస్తున్న పోరాటం. మంచిదే వాళ్ళను నేను తప్పు పట్టను కాని, నేనొక విషయం ప్రతిపాదిస్తున్న ఏమిటంటే నాకు 365 రోజులు సంవత్సరములో మంచిరోజులే ఎందుకంటే యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి. యేసయ్య మనతో లేకపోతే అన్ని చెడ్డరోజులే యేసు మనతో ఉంటే అన్ని మంచి రోజులే. ఇప్పుడు యేసయ్య నాతో ఉంటే 365 రోజులు మంచి రోజులే అనుకున్నప్పుడు ఆ యొక్క హిందువు, పురోహితుడు శాస్త్రం తెలిసిన పెద్దమనిషి ఎవరైనా ఉండి లెక్కలు వేసి ఈ రోజు మంచిరోజు అని మీకు అన్నాడు అనుకోండీ.  నాకు 365 రోజులలో ఇది కూడా మంచిదే కాని ఈ ఒక్క రోజే చెడ్డరోజు కాదు కదా. ! అన్ని సమయాలు యేసులో ఉన్నవాళ్ళకు శుభదినాలు అయినప్పుడు ఆ అనుభవం లేని వాళ్ళకు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనేది ఉన్నప్పుడు వాళ్ళు మంచిదన్న ముహూర్తాన్నే మనం కూడా పనులు చేసేద్దాం, అది మనకేమి నిషిద్ధం కాదు. ఏ పని చేసినా ఈ రోజు మంచిదా? అని చూడం మనం ప్రార్థన చేసి మొదలు పెడితే అన్ని మంచిరోజులే, అన్నీ మంచికార్యాలే. జయప్రదం అవుతాయి. ప్రార్థనా, యేసు రక్తం అనేవి అశుభాలను దహించి వేయగలిగిన అగ్ని.  కాబట్టి కొంతమంది బలహీనులు ఆ విధంగా చేసుకుంటున్నారు మనం పెద్దగా పట్టించుకోవద్దు. వాళ్ళు మెల్లిగా విశ్వాసంలో పెరిగిన కొలది వారు మానేస్తారు. మనం చింతించాల్సిన అవసరం లేదు. రక్షణపొందిన వాళ్ళు విసర్జించవలసిన ఆవశ్యమైనటువంటి సంగతులు కొన్ని అపోస్తలు. 15:28లో ఉన్నది. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదనీ పరిశుద్ధాత్మకు, మాకును, తోచెను.  వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు క్షేమము కలుగును గాక. ఇది ఆదిమ అపోస్తలులు నూతనంగా అన్యులలో నుండి రక్షణ పొందుతున్న వారి కొరకు ఇచ్చినటువంటి హెచ్చరిక.  అపో. 15:19లో చెప్పాడు.  మనం కష్టపెట్టకుండా కఠినమైన, నియమాలు పెట్టి మీరు నగలు తీయండి. అలా అని వారిని కష్ట పెట్ట కూడదు. కొందరు నన్ను అయ్యగారు మా పాపకు పెళ్ళి చేయండి అని అంటారు.  కాని ఒకే రోజు నాలుగైదు పెళ్ళిలు ఉంటే నేను చెయలేను కదా! మనదేశ ధర్మశాస్త్రాల ప్రకారం, జోతీష్క్య శాస్త్రం ప్రకారం వారు జన్మ నక్షత్రాల ప్రకారం ఇది మంచిరోజు అని చెప్పారు. అంటే క్రైస్తవుల వెళ్ళి, హిందు పండితులను అడిగి ఈ రోజు బాగున్నది అని తమ పిల్లల పెళ్ళీలు చేస్తున్నారు. అని తెలిసింది పౌలు భక్తుడిలాగా ధర్మశాస్త్రం ఎరిగిన వారికినీ ఎరిగినట్లు ఉండాలి, తెలియని వారికి తెలియనట్లు ఉండాలి అని నేను అలాగే ఉంటాను. వారు అలా చేసినా ఏమి కాదు.  ప్రార్థించగానే యేసయ్య దిగి వస్తాడు. మనమైతే అన్ని దేవతలను ఆరాధించడం లేదు. యేసుని తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధిస్తే తప్పు.  “నేను తప్ప వేరొక దేవుడు లేడు” అన్నాడు.  విగ్రహములకు ఆరాధించకూడదు.  బైబిలు ప్రకారము జారత్వము చేయకూడదు. ఇవి తప్ప మిగతావి పట్టించుకోకండి అని చెప్పాడు.