206. ప్రశ్న : డిటెన్షన్ సెంటర్లో పెట్టడం వల్ల ముస్లింలు 28 మంది చనిపోయారు. అంతే కాకుండా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో దళితుల గుడిలోకి వచ్చి దళితులు, అనే నెపంతో వారిని కొట్టి కాళ్ళు  వేళ్లు విరగొట్టారు చంపేసారు. ఈ విషయాల పట్ల ఏ విధంగా స్పందించాలి?  ప్రజలు ఏ విధంగా ఉండాలి?  మీరు ఏ విధమైన పిలుపునిస్తారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     ఎవరైనా న్యాయం జరగాలి అన్నా, అన్యాయాన్ని ఆపాలి అన్నా, ఎదిరించాలన్నా, చాలా Direct గా చెప్తున్నాను. ఏమిటంటే యేసును ద్వేషించడం మానండి. అప్పుడు న్యాయము కొరకు ఎవరైనా పోరాడగలుగుతారు. అన్యాయాన్ని నశింపజేయ గలుగుతారు. అరికట్టగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానో ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే ఇటీవల బి.జే.పి వాళ్ళు మీటింగు పెట్టి ఎస్.సి., ఎస్.టి. ముర్దాబాద్ అని నినాదాలు ఇవ్వడాన్ని మనం మీడియాలో చూశాం.  మరి ఆ పార్టీ జెండాను దళితులు ఎందుకు మోస్తున్నారు? మోయకూడదు కదా! మహిళలను అరగంటకు ఒక రేప్ జరుగుతుంటే బి.జే.పిలో ఉన్నటువంటి మహిళ నాయకురాళ్లు అది పెద్ద విషయం కాదు, ఏం పట్టించుకోకండి అని, నాయకురాల్లే అంటున్నారు. వారు ఖండించకపోగా పర్వాలేదు, అనే సందేశాన్ని సమాజంలోకి పంపుతావుంటే ఒక్క మహిళ కూడా జెండా మోయకూడదు కదా! మరి మహిళలకు ఇంత ఆత్మగౌరవం లేకుండా నారీమణులు, మహిళలు ఎందుకు ఇంత దారుణమైన వైఖరి ఇక్కడ విషయం ఏమిటంటే నన్ను రేప్ చేసినా, నేను ఆజెండానే మొస్తాను, ఎందుకంటే అది యేసును ద్వేషించే పార్టీ. యేసును పక్కనబెట్టి నేను న్యాయపోరాటం చేస్తా అనడంవల్ల పోరాటం విఫలమయిపోతుంది. ఇది డా॥అద్దంకి రంజిత ఓఫిర్ చేస్తున్న ప్రకటన. నేను సామాజిక న్యాయ పోరాటంలో సైనికుడ్ని. యేసుని మీరు నమ్మకండి, బాప్తిస్మము తీసుకోకండి. కాని ద్వేషించకండి. అలా ద్వేషం ఉంటే వారికి న్యాయం జరుగదు. ఎందుకంటే నీతి న్యాయములు కలవాడు యేసుప్రభువు. , నీతి న్యాయములు ఆయన సింహసనానికి ఆధారము అని బైబిలులో ఉంది. అసలు ఇప్పుడు కాదు రామ్నాథ్ కోవింద్ గారిని బ్రహ్మదేవాలయం ఆగ్రాలో బయటకు వెళ్ళగొట్టిన్నపుడే దేశంలోని దళితులందరు ఒక్కటై ఈ ప్రభుత్వం మాకొద్దు అని, మళ్ళీ గద్దెనెక్కకుండా దించిపారేయాలి.  ఎవరికి రోషం లేదు. మనదేశ పౌరుడు రాష్ట్రపతి గారికి అవమానం జరిగితే దళితులందరు ఎందుకు ఒక్కటి కాలేరు? ఎందుకంటే హృదయంలో చీకటి అందరిలో గూడు కట్టుకుంది.  దేవుడంటే ద్వేషం. యేసుని ద్వేషించడం మాననంత వరకు దేశం అభివృద్ధి కాదు. దళితులే సహకరించని పరిస్థితి.  ఆనాడు బాబాసాహెబ్ గారికి, ఇప్పుడు మనకు ఎదురైతుంది. ఇన్ని అవమానాలు ఎదురుకుంటారు కాని ఆ జెండాను మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే యేసుకు విరోధం గనుక ఇక్కడ మానభంగాలు, ప్రాణాలు పోయినా గాని ఇది వారిలో ఉన్న చీకటి. నేను చెప్తున్నాను ఏమిటంటే అందరు ఒకటి కావాలి. మాకు ఈ అధికారం వద్దు, ఈ అబద్దాలు చెప్పేవారు మాకు వద్దు, ఈ అబద్దాలు చెప్పేవారు మాకు వద్దు అని చెప్పాలి. రానున్నవి ఇంకా దుర్దినాలు. చీకటి రోజులు వస్తాయి దళితులు అందరూ ఒక్కటై ఈ విధంగా మానప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ మనుషులు ఈ రాక్షసపాలన మాకు వద్దు అని అందరూ ఏకం కావాలి.  అప్పుడు న్యాయం జరుగుతుంది. దళిత ఉద్యమానికి దళితులే ఎందుకు సపోర్టు ఇవ్వలేదు అని స్వపరీక్ష చేసుకొని, కొంచెం పశ్చత్తాపపడి ఒక కొత్త నిర్ణయంలోకి, అణగారిన వర్గాలవారు రావాలి. ఇది ఇండియా ప్రజాబంధు పార్టీ ఉద్యమం, సందేశం అవైర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతాం.