(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నా పేరు చెప్పనోళ్ళు రెండు రకాలు. అందులో ఒక రకం ఏమింటంటే చాలా ప్రశస్తమైన, విలువైనా విశేషమైన విజ్ఞానం ఓఫీర్ గారి గ్రంథంలో దొరికింది అది, ఈభూమ్మీద ఏ ఇతర గ్రంథంలోనూ మాకు దొరకదు, దొరకలేదు, దొరకబోదు గనుక దీన్ని అందించాలి కానీ ఈ గొప్ప సమాచారం ఇచ్చాము అన్న ఘనత మాకు రావాలి, అనే అహం భావంతో చెప్పేవారు కొంతమంది. మరికొంత మంది ఏమో నా తండ్రి కరెక్టుగా చేసాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయన చేసినదంతా దైవచిత్త ప్రకారమే అని, ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు. గనుక ఇప్పుడు దాచిపెడతాను తరువాత చెప్తాను అనుకోవడం ఇంకోరకం. ఈ రెండు తప్పే. ఇప్పుడు మొదట నేను చెప్పిన వాళ్ళేమో డైరెక్టుగా కోరహులు. రెండోది తరువాత చెప్తాను అనుకున్నవాడేమో కోరహులను ప్రోత్సహిస్తున్నావారు అన్నమాట.