(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పౌలు చెప్పిన బోధే, తిమోతి చెప్తాడు తప్ప ఇంకొకడు చెప్పడు, నా వలన విన్న సంగతులు సామర్థ్యం గల నమ్మకమైన ఇతర మనుష్యులకును నేర్పించు, అప్పగించు, వారిని వేరే వాళ్ళకు చెప్పమని అంటాడు. ఈ గురుశిష్య పరంపర ఇలాగే ఉన్నది. కాని పౌలు పేరు చెప్పుకోవడానికి తిమోతి సిగ్గుపడడు. ఇప్పుడు వీళ్ళకు ప్రత్యక్షత అనేది ముందు భక్తునికి వచ్చి అక్కడి నుండి లోకంలో అంతా వ్యాపిస్తుంది. మొదట ఆ ప్రత్యక్షతను రిసీవ్ చేసుకున్న భక్తుడు, భక్తుని పేరు మరుగుచేయడం అనేది దొంగతనం. వాడు కరెక్టుగా దైవజనుడైతే ఆ దొంగతనం చేయకూడదు. ఏ భక్తుని ద్వారా మొట్ట మొదటి ప్రత్యేక్షత భూమ్మిదికి వచ్చిందో అతని పేరుతో పాటుగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేనున్నాను నేను ఏడుపండగల అంశాన్నీ చాలా చోట్ల బోధించాను నా ప్రమాణవాక్యము అనే ఆఖరి ప్రణాళిక గ్రంథంలో రాసాను కూడా. అయితే వీనిగూర్చి నేను వందసార్లు చెప్పుకున్నాను ఏడు పండుగలు అంశం ప్రత్యేకంగా ధ్యానించాలి దాంట్లో చాలా మ్యాటర్ ఉన్నది అనే విషయాన్ని. నాకు Sir. Dr.Robert Thomson అనే ఒక అమెరికా భక్తుడు. ఆయన హైదరాబాదుకు వచ్చినపుడు ఆయన నోట నేను విన్నాను. ఆయన అందించినటువంటి అంశమును, జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని నేను దేవునిముందు ఉంచి ప్రార్ధన చేసి, మరింత ముందుకెళ్లి. ఇది ఈ తరానికి అవసరమైన సందేశం అని దేవుని ద్వారా నేను ప్రత్యేక్షతను పొంది, నేను చెబుతున్న కాని ముందు దానిమీదికి నా ధ్యానాన్ని మల్లించినటువంటి, భక్తుడు మాత్రం రాబర్ట్ తోమ్సన్ గారు. అని నేను స్పష్టంగా చెప్పాను. నేను ఎవరి నుండి ఏం పొందానో చెప్పుకుంటూ. ఆ ప్రత్యక్షతలను నేను వ్యాపింపజేస్తున్నాను. నాకు దేవుడు ఏమని చెప్తే నేను అందరికి అదే చెప్తున్నాను. అంతేగాని ఆ భక్తుల పేర్లు మాత్రం చెప్పను. నేను సత్యం వ్యాపింపజేస్తాను, వారి పేరు మాత్రం ఎత్తను అని, సత్యం చెబుతాను. అనేవాడు తప్పకుండా దొంగ. న్యాయపీఠం ముందుకెళ్ళినాక. సిగ్గుపరచబడతాడు. తప్ప బహుమానం అందుకోడు. ఇలాంటి వారికోసం యిర్మీయ 23:30 కాబట్టి తమ జతవారి యొద్ద నుండి నామాటలను దొంగిలించు. ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యెహోవా వాక్కు. ఆ ప్రవక్తల క్రిందికే వస్తారు. వీళ్ళు యదార్థవంతులైతే రంజిత్ ఓఫీర్ ద్వారా నేను జ్ఞానాన్ని పొందాను అని, దేవుడు నాతో ఆయన ద్వారా మాట్లాడాడు అని చెప్పాలి. లేకపోతే వీళ్ళు దొంగలు గానే, న్యాయపీఠం ముందు నిలబడతారు.