213. ప్రశ్న : ఆదాము, హవ్వలకు కయీను, హేబేలు పుట్టారు కదా! మరి కయీనుకు భార్య ఎలా వచ్చింది చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      లేవీయాకాండము 20:16, 17, 23లో స్త్రీ ఒక మగ జంతువుతో, పురుషుడు ఆడ జంతువుతో కలవడము సుఖపడడము ఇంత చండాలపు కార్యాలు కూడా ఆ కానాను దేశం వారు చేసారు. తరువాత సొంత తోడబుట్టిన చెల్లెను, వాళ్ళ సొంత రక్తం పంచుకొని పుట్టినవారితోనే శారీరక సంబంధాలు పెట్టుకోవడం అనేది కనాను దేశంలో ఉన్నవారు చేసారు గనుకనే, నేను వాళ్ళను అసహ్యపడి, అక్కడినుండి వెళ్ళగొడుతున్నాను అని దేవుడు అన్నాడు.  ఇది క్రీ.పూ 1500ఏళ్ళ నాడు ఉన్న పరిస్థితి. అంతకన్న ముందుకు వెళ్తే క్రీ.పూ 2000 సం॥ల నాడు అబ్రహాము వెళ్ళి చేసుకున్నది కూడా తన హాఫ్ సిస్టరే. అబ్రాహాముకు తండ్రి ఒక్కరే కాని తల్లులు వేరు. అంటే ఆదాము తరువాత రెండువేల యేండ్ల తరువాత అబ్రహాము పుట్టాడు. ఆదాము తరువాత రెండువేల యేండ్లు అయిన తరువాతనే అబ్రహాముకు ఎవరు పెళ్ళి చేసుకోవడానికి దొరకనట్టు, వాళ్ల నాన్నకు, ఇంకోతల్లికి పుట్టినటువంటి చెల్లెను చేసుకున్నాడు. అలాంటప్పుడు ఆదాము సొంత కొడుకుకు ఇంకో భార్య ఉన్నది. ఆదాము సొంత కొడుకు కయీను. వాడికి భార్య కావాలి అంటే వేరేదారి ఏమున్నది? ఆదాము యొక్క కుమార్తెనే చేసుకున్నాడు. దీంట్లో వేరే, సందేహానికి, అభిప్రాయానికి ఆస్కారమే లేదు. ఆదికాండము 5:3,4లో కయీను హేబెలు అనేది మొదటి సంతానం.  తరువాత హేబేలును, కయీను చంపాడు. తరువాత దేశదిమ్మరి అయిపోయాడు. తరువాత షేతు పుట్టాడు. ఎనిమిది వందల ఏళ్లు పిల్లలను produce చేస్తూనే ఉన్నారు. 930 ఏళ్ళు అప్పటి జీవన కాలం ఉండేది. గనుక ఈ దేశదిమ్మరిగా కయీను అక్కడ దేశాలు తిరిగి వచ్చి తన చెల్లెను చూసి పెళ్ళి చేసుకున్నాడు. అది విషయం.