(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ప్రకృతి మొరపెడుతుంది అనేది బైబిలులోని గొప్ప సత్యాల్లో ఒకటి. రోమా 8:21లో ఏలయనగా సృష్టి నాశనములోనికి లోనైన, దాస్యమునుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును, అనే నిరీక్షణ కలిగినదై, స్వేచ్చగా కాక, లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరుచును. 22 లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది. అదేంటంటే ప్రజలందరూ పాపం చేస్తున్నప్పుడు భూమి, ఆకాశము, అక్కడున్నటువంటి పంచభూతాలు అన్ని మొరపెడుతాయి, అది తట్టుకోలేక.